బీ అలర్ట్...మెట్రో రైల్లో తింటే ఫైన్ వేస్తారా..?

బీ అలర్ట్...మెట్రో రైల్లో తింటే ఫైన్ వేస్తారా..?

మెట్రోలో  ఏ ఆహారం తినొద్దా.. మెట్రో రైల్లో తింటే ఫైన్ విధిస్తారా..? ఎంత ఫైన్ విధిస్తారు..కేవలం ఫైన్ తోనే సరిపెడతారా..? లేక కేసు కూడా బుక్ చేస్తారా..? అవును..మెట్రో రైల్లో తింటే అధికారులు ఫైన్ వేస్తారు.  ఫైన్ తో పాటు..కేసు కూడా నమోదు చేస్తారు. మెట్రో రైల్లో ఆహారం తినడం నిషేధం. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే ప్రయాణికులకు ఫైన్, వారిపై కేసులు పెడతారు. ప్రస్తుతం ఓ ప్రయాణికుడికి ఫైన్ తో పాటు..అతనిపై కేసు కూడా పెట్టారు. 

ఓ వ్యక్తి మెట్రో రైల్ ఎక్కాడు. కొద్ది దూరం ప్రయాణించిన తర్వాత..అతను తన వెంట తెచ్చుకున్న గోబీ మంచూరియా పార్సిల్ ను ఓపెన్ చేశాడు.  సీట్లో కూర్చోని ఎంచక్కా తినడం ప్రారంభించాడు.  అయితే అతని స్నేహితులు మాత్రం..మెట్రోలో తినొద్దు తింటే ఫైన్ వేస్తారని చెప్పినా వినలేదు. సదరు ప్రయాణికుడు గోబి మంచూరియా తింటున్నప్పుడు ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది కాస్త వైరల్ అయి..మెట్రో అధికారుల దృష్టికి వెళ్లింది. 

నిబంధనలను ఉల్లంఘించినందుకు మెట్రో రైల్ అధికారులు ఆ వ్యక్తికి ఫైన్ విధించారు. రూ. 500 జరిమానా కట్టాలని ఆదేశించారు. అంతేకాదు అతనిపై కేసు కూడా నమోదైంది. తన ప్రయాణాన్ని ముగించుకుని మెట్రో స్టేషన్ లో దిగిన తర్వాత..మెట్రో అధికారులు అతని చేత ప్రమాణం చేయించారు.  భవిష్యత్తులో మెట్రోలో ఆహారం తిననని ప్రతిజ్ఞ చేశాడు. ఈ ఘటన బెంగుళూరులో చోటు చేసుకుంది. 

కొన్ని రోజుల క్రితం బెంగుళూరు  జయనగర్,  సంపిగె రోడ్ స్టేషన్ల మధ్య నడిచిన మెట్రో రైల్లో ఓ సాధారణ ప్రయాణీకుడు గోబి మంచూరియా తిన్నాడు. అతను గోబి మంచూరియా తింటున్న వీడియో వైరల్ కావడంతో మెట్రో అధికారులు చర్యలు తీసుకున్నారు. BMRCL  నిబంధనలను ఉల్లంఘించినందుకు కేసు నమోదు చేసి రూ. 500 జరిమానా విధించింది. అతనిపై జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.