హైదరాబాద్ లో దారుణం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ పట్టుబడ్డ వ్యక్తి పోలీస్ స్టేషన్ ఎదుటే పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బుధవారం ( నవంబర్ 5 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరిలో చోటు చేసుకుంది ఈ ఘటన. దమ్మాయిగూడకు చెందిన మీన్ రెడ్డి అనే 32 ఏళ్ళ యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులకు పట్టుబడ్డాడు. అవమానాన్ని భరించలేక కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు మీన్ రెడ్డి.
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పోలీసులు వ్యవహరించిన తీరుతో మనస్తాపం చెందిన మీన్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డట్టు సమాచారం. బుధవారం అర్థరాత్రి సమయంలో ఘటన జరిగినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా.. మీన్ రెడ్డి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో రీడింగ్ 120 వచ్చినట్లు చెబుతన్నారు కుషాయిగూడ ట్రాఫిక్ పోలీసులు.
పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మీన్ రెడ్డి మృతితో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.
