పోక్సో కేసులో  20 ఏండ్ల జైలు

పోక్సో కేసులో  20 ఏండ్ల జైలు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోక్సో కేసులో ఓ వ్యక్తికి 20 ఏండ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం మొదటి అదనపు జిల్లా, సెషన్స్​జడ్జి ఎం. శ్యాం శుక్రవారం తీర్పునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం ముష్టిబండ గ్రామానికి చెందిన ఓ మహిళ తన ఏడేండ్ల  కూతురిని పక్కింటికి వెళ్లి బియ్యం తీసుకురమ్మని 2019  జనవరి 3న పంపించింది. ఎంతసేపటికీ కూతురు రాకపోవడంతో ఆమె పక్కింటికి వెళ్లి తలుపు కొట్టింది. ఇంట్లో ఉన్న ప్రసాద్​ కంగారుగా వచ్చి తలుపులు తీయడంతో ఏడుస్తూ చిన్నారి బయటకు వచ్చింది. చిన్నారి ఒంటిపై దుస్తులు సక్రమంగా లేకపోవడంతో ఆ మహిళ విషయాన్ని భర్తకు చెప్పింది. కూతుర్ని తీసుకొని తల్లిదండ్రులు దమ్మపేట పొలీస్​ స్టేషన్​లో కంప్లైంట్ ​ఇచ్చారు. అప్పటి ఏఎస్సై షేక్​సర్దార్​కేసు నమోదు చేయగా పాల్వంచ డీఎస్పీ మధుసూదన్​రావు దర్యాప్తు చేపట్టారు. పది మంది సాక్షుల విచారణ అనంతరం ప్రసాద్​కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 20 వేలు ఫైన్​ విధించారు. బాలికకు రూ. 5 లక్షల పరిహారం చెలించాలని తీర్పునిచ్చారు.