మామిడి పండ్ల కోసం భార్యను కొట్టిచంపిన భర్త

మామిడి పండ్ల కోసం భార్యను కొట్టిచంపిన భర్త

మామిడి పండ్లు ఇవ్వలేదని భార్యను కొట్టిచంపిన ఘటన ఒడిషాలో జరిగింది. భద్రాక్ జిల్లాలోని జలముండ గ్రామానికి చెందిన కార్తీక్ జేనా సోమవారం రాత్రి మద్యంమత్తులో ఇంటికి వచ్చాడు. తినడానికి మామిడి పండ్లు ఇవ్వమని కార్తీక్ తన భార్యను అడిగాడు. అందుకు అతని భార్య.. పిల్లలు మామిడి పండ్లన్ని తిన్నారని చెప్పింది. దాంతో మద్యం మత్తులో ఉన్న కార్తీక్.. వెదురు బొంగును తీసుకొని ఆమెను చితక్కొట్టాడు. దెబ్బలకు కార్తీక్ భార్య అరవడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చి చూశారు. అప్పటికే కార్తీక్ భార్య అపస్మారక స్థితిలో పడి ఉంది. వెంటనే ఆమెను స్థానికులు ధమనగర్ ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. దెబ్బలు బలంగా తాకడంతో ఆమె చనిపోయినట్లు ధృవీకరించారు.

‘మామిడి పండ్లు ఇవ్వలేదని తాగిన మత్తులో కార్తీక్ తన భార్యను కర్రతో కొట్టి చంపాడు. కార్తీక్ ను మంగళవారం అరెస్టు చేశాం. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’ అని పోలీసు సూపరింటెండెంట్ కైలాష్ చంద్ర పరిదా తెలిపారు.

For More News..

హైదరాబాద్ లో 155 మంది పోలీసులకు కరోనా

వీడియో: గ్లాస్ డోర్ ఓపెన్ ఉందనుకొని గుద్దుకున్న మహిళ.. క్షణాల్లో మృతి

హైదరాబాద్ గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్