గ్రేట్ లవర్: టెక్నాలజీ నేర్చుకుని ప్రేయసికి ప్రపోజల్.. వీడియో

గ్రేట్ లవర్: టెక్నాలజీ నేర్చుకుని ప్రేయసికి ప్రపోజల్.. వీడియో

మనసుంటే ఏమైనా చేయొచ్చు. ప్రేమించిన పిల్లకి ప్రపోజ్ చేయడానికి డిఫరెంట్‌గా ట్రై చేస్తుంటారు కొంత మంది లవర్స్. అలానే ఈ యువకుడు వీడియో గేమ్ డెవలప్‌మెంట్ టెక్నాలజీ నేర్చుకుని తన ప్రేమను కొత్తగా ఎక్స్‌ప్రెస్ చేశాడు. అమెరికాకు చెందిన డెనిస్ వేల్స్ అనే యవకుడు 8 ఏళ్లుగా ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. వారిద్దరి మధ్య అల్లుకున్న ఆ బంధాన్ని జీవితకాలం గుర్తిండిపోయేలా ఆమెకు పరిచయం చేయాలనుకున్నాడు. ఎలా అని ఆలోచిస్తే డిఫరెంట్ ఐడియా వచ్చింది. అంతే దాన్ని ఆచరణలో పెట్టడానికి నెలల తరబడి కష్టపడాల్సి వచ్చినా వెనుకడుగు వేయలేదు.

9 నెలలు కష్టపడి నేర్చుకుని..

తన ప్రియురాలికి ఓ పువ్వు ఇచ్చికూడా ప్రపోజ్ చేయొచ్చు. కానీ లైఫ్ టైం తన ప్రేమ గుర్తుండి పోవాలని అమెరికాకు చెందిన వేల్స్ ఆలోచించాడు. కష్టపడి వీడియో గేమ్ డెవలప్ చేయడం, పిక్సెల్ ఆర్ట్ నేరుకున్నాడు. తమ రిలేషన్‌లోని అనేక సంఘటనల్ని గేమ్‌లో రూపొందించాడు. స్టేజ్‌ల వారీగా దాటుకుంటూ వస్తే చివరికి ప్రపోజ్ చేసేలా డిజైన్ చేశాడు. ఈ మొత్తం పూర్తి చేయడానికి అతడికి 9 నెలల సమయం పట్టింది.

వీడియో గేమ్ తయారు చేసి తన ప్రేయసిని కంప్యూటర్ ముందు కూర్చోబెట్టాడు. వీడియోలో ఉన్న అమ్మాయి నువ్వే అని చెప్పడంతో ఆమె చాలా సంతోషంతో పొంగిపోయింది. ఈ గేమ్ నువ్వే చేశావా అని పదేపదే వేల్స్‌ను అడిగింది. ఆ బొమ్మలో తాను చాలా అందంగా ఉన్నానంటూ మురిసిపోయింది. గేమ్ చివరిలో ‘విల్ యూ మ్యారీ మీ’ అని రాగానే ఫిదా అయిపోయిన ఆమె ఆనందంతో వేల్స్‌ని కౌగిలించుకుంది.

జీవిత కాలం గుర్తుండాలని..

ఆ వీడియో గేమ్ ముందు ప్రియురాలి కూర్చోబెట్టింది మొదలు ఆమె దాన్ని చూసి చివరికి ప్రపోజల్‌ని ఓకే చేసే వరకు అంతా వీడియో తీశాడు వేల్స్. ఆమెకు తెలియకుండా.. సర్‌ప్రైజ్‌లా ఈ హావభావాలు జీవితకాలం గుర్తుండేలా దీన్ని చిత్రించాడు. ఈ వీడియోను డిసెంబరు 20న యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాడు. వారం రోజుల్లోనే ఈ వీడియోని 50 వేల మందికి పైగా చూశారు. గ్రేట్ లవర్, సూపర్ అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.