డిజిటల్ యుగంలో అన్ని స్మార్ట్ ఫోన్ తోనే జరిగిపోతున్నాయి..ఇంట్లో వంటల దగ్గర నుంచి రాకెట్ సైన్స్ వరకు అన్ని ఫోన్లోనే నేర్చుకునే రోజులు వచ్చేసాయి. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపే.. టెక్నాలజీని విధ్వంసానికి వాడుతున్నారు కొందరు కేటుగాళ్లు. యూట్యూబ్ లో చూసి బాంబులు వంటివి తయారు చేసి విధ్వంసం సృష్టించిన ఘటనల గురించి వినే ఉంటారు... ఇప్పుడు మన కుమ్రంభీం జిల్లాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. యూట్యూబ్ లో చూసి తుపాకులు తయారు చేసి.. వ్యాపారిని బెదిరించాడు నిందితుడు. మంగళవారం ( డిసెంబర్ 2 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి...
జిల్లాలోని కౌటులకు చెందిన కుప్రాంకర్ అజయ్ యూట్యూబ్ లో చూసి తుపాకులు తయారు చేసి వ్యాపారిని బెదిరించాడు. డబ్బులు ఇవ్వాలని బెదిరించిన అజయ్.. వ్యాపారిపై కాల్పులు జరిపాడు.ఒక్కసారిగా కాల్పులు జరపడంతో భయపడ్డ బాధితుడు.. తృటిలో తప్పించుకొని బయటపడ్డాడు. అజయ్ దౌర్జన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు.
రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.యూట్యూబ్ లో చూసి తుపాకుల తయారీ నేర్చున్నానని నిందితుడు విచారణలో చెప్పినట్లు తెలిపారు పోలీసులు.
