
హైదరాబాద్ లోని పాతబస్తీలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. తలపై బండరాళ్లతో కొట్టి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మిసిరిగంజ్ అక్సా మజీద్ వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారం మేరకు.. పోలీసులు, క్లూస్ టీం ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడిని కుమార్ వాడి వాసి సిద్దిక్ గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.