వీడు మాములోడు కాదు : అపార్ట్ మెంట్ బాల్కనీలో కార్లు పార్కింగ్..

వీడు మాములోడు కాదు : అపార్ట్ మెంట్ బాల్కనీలో కార్లు పార్కింగ్..

గోడ మీదకు పిడక ఎలా వచ్చింది.. ఆవు గోడపైన పేడ ఎలా వేసింది.. ఇలాంటి డౌట్ తో భూలోకానికి వచ్చిన చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు.. సేమ్ టూ సేమ్.. ఇప్పుడు ప్రపంచం అంతా ఓ ఆశ్చర్యంగా చూస్తుంది ఈ ఫొటోలను.. ఐదు అంతస్తుల అపార్ట్ మెంట్ పైకి కార్లు ఎలా ఎక్కాయి.. ఎలా వెళ్లాయి అనేది..

తైవాన్ లో ఓ అపార్ట్ మెంట్ బయట స్ట్రీట్ లో పార్కింగ్ చేసిందుకు ఓ వ్యక్తి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. పార్కింగ్ చేసిందుకు అతనికి పోలీసులు జరిమానా కూడా విధించారు. ఇంట్లో పార్కింగ్ ప్లేస్ లేకపోవటం.. తన కార్లను రోడ్డుపైనే పెడుతుండటంతో.. రెగ్యులర్ గా అతనికి ట్రాఫిక్ పోలీసులు ఫైన్స్ వేస్తూనే ఉన్నారు. పలుమార్లు ఇదే తరహా ఘటనలు పునరావృతం కావడంతో విసుగు చెంది, చాలా హర్ట్ అయిన ఆ వ్యక్తి.. ఎవరూ ఊహించలేని పని చేశాడు. కాంట్రాక్టర్‌గా పని చేస్తోన్న ఆ వ్యక్తి,.. తాను నివాసముంటున్న అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపైకి తన రెండు వ్యాన్లను తీసుకెళ్లాడు.

ఎలా ఎక్కించాడంటే..

దీని కోసం ఓ భారీ క్రేన్ మాట్లాడుకున్నాడు. ఆ క్రేన్ సాయంతో.. ఒక వ్యాన్ ను పైకప్పు భాగంలో ఉంచాడు, మరో కారును బాల్కనీలో ఉన్న స్థలంలో సర్దేశాడు. కారు వెనక భాగం బయటకు కనిపించేలా పెట్టాడు. ఇలా భవనంపై పార్కింగ్ చేయడంపై అందరూ షాక్ అయ్యారు. బిల్డింగ్ కు ఇబ్బంది వస్తుందని.. చుట్టుపక్కల వాళ్లకు ప్రమాదం అని చాలా మంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వారి ఆందోళనపై స్పందించిన ఆ వ్యక్తి.. ఇది భవనంపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఎలాంటి గొడవ చేయొద్దని కోరారు. బిల్డింగ్ ను స్టీలు, కాంక్రీటుతో నిర్మించారని, అందు వల్ల రెండు వ్యాన్ల బరువుని సులభంగా మోయగలదని మిగతా వాళ్లకు సర్దిచెప్పాడు. ఈ విషయం తెలిసిన సిటీ అధికారులు సైతం అవాక్కయ్యారు. పై కప్పు నుంచి వాహనాలను కిందకు దించాలని కోరారు. కానీ ఆ వ్యక్తి మాత్రం తాను సాంకేతికంగా ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని.. వ్యాన్లను కిందకు దించేది లేదని తేల్చి చెప్పాడు. వాహనాలను దించేందుకు నిరాకరించాడు. అధికారులు, పోలీసుల ఒత్తిడితో ఎట్టకేలకు మళ్లీ క్రేన్లు తీసుకొచ్చి.. రెండు వ్యాన్లను అపార్ట్ మెంట్ పైనుంచి కిందకు తీసుకొచ్చాడు.