కుక్కను బతికించాడు.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

కుక్కను బతికించాడు.. హృదయాలను కదిలిస్తున్న వీడియో

ఓ వీధిలో అపస్మారక స్థితిలో ఉన్న కుక్కకు ఓ వ్యక్తి ప్రాణం పోశాడు. కదలకుండా ఉన్న ఆ కుక్కను బతికించడానికి శతవిధాల ప్రయత్నించాడు. కానీ.. ఎంత ప్రయత్నించినా.. అది లేవలేదు. దీంతో అది చనిపోయిందా అని అనుమానించాడు. చివరి ప్రయత్నం చేశాడు. అమాంతం అది లేచి కూర్చొవడంతో అతను ఊపిరిపీల్చుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంతో మంది హృదయాలను కదిలించింది.  నిర్ఝీవంగా పడి ఉన్న ఓ కుక్కకు CPR (Cardiopulmonary resuscitation) చేశాడు. చేతులకు గ్లౌజ్ వేసుకున్న ఆ వ్యక్తి కుక్క గుండెపై అదిమాడు. అలా ఒకటి రెండు..మూడు సార్లు చేశాడు. కానీ. కుక్కలో మాత్రం ఎలాంటి చలనం కనిపించలేదు. దీంతో కుక్కను మరోవైపుకు పడుకోబెట్టాడు. మరలా అలానే చేశాడు.

కానీ.. ఎలాంటి ఫలితం కనబడలేదు. చనిపోయిందా ? అని అనుకున్నాడు. చివరి ప్రయత్నం చేశాడు. బలంగా దాని గుండెలపై చేతులతో అదిమాడు. ఒక్కసారిగా కుక్క లేచి నిలబడింది. ఈ వీడియోను Awanish Sharan ఐఏఎస్ ఆఫీసర్ ట్వీట్ చేశాడు. క్షణాల్లో ఈ వీడియో వైరల్ అయ్యింది. ఎంతోమంది నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది. కుక్కను బతికించడానికి అతను చేసిన ప్రయత్నానికి హాట్సాఫ్ చెబుతున్నారు నెటిజన్లు. షేర్ చేయబడిన ఈ వీడియోను దాదాపు లక్షల మంది చూడగా.. వేల మంది రీ ట్వీట్ చేశారు. 
 

మరిన్ని వార్తల కోసం : -
తగ్గిన శిశు మరణాల రేట్


తూర్పు ఉక్రెయిన్​లో చీకట్లు