తూర్పు ఉక్రెయిన్​లో చీకట్లు

తూర్పు ఉక్రెయిన్​లో చీకట్లు
  • సిటీలు, టౌన్లు, గ్రామాలకు పవర్ కట్లు
  • నీళ్లు, ఫుడ్ సప్లై కూడా బంద్ 
  • రష్యా నిరంతర దాడులతో.. విద్యుత్​ సిబ్బందికి ఆటంకం
  • లుహాన్స్క్ లోని  రెండు... సిటీల్లో హోరాహోరీ

కీవ్/మాస్కో: ఉక్రెయిన్ లోని తూర్పున ఉన్న డాన్ బాస్ ఏరియాలో చీకట్లు అలుముకున్నాయి. దాదాపు అన్ని పట్టణాలు, సిటీలు, గ్రామాలకు కరెంట్ సప్లైకి ఆటంకం ఏర్పడుతోంది. డాన్​బాస్​లో రష్యా నిరంతరం దాడులు చేస్తుండటంతో కరెంట్ ఆగిపోయిన ప్రాంతాల్లో విద్యుత్ సిబ్బంది రిపేర్లు చేసేందుకు వీలవడంలేదు. అలాగే మున్సిపల్ సిబ్బంది కూడా పని చేసే పరిస్థితి లేకపోవడంతో నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. షెల్లింగ్ జరుగుతున్న చప్పుడుతో హడలి చస్తున్నామని, అందుకే.. కరెంట్, వాటర్ సప్లైకి తీవ్ర ఆటంకం ఏర్పడుతోందని లుహాన్స్క్ ప్రాంత విద్యుత్, మున్సిపల్ సిబ్బంది చెప్తున్నారు. 

రెండు సిటీల్లో హోరాహోరి

లుహాన్స్క్ ప్రావిన్స్​లోని చివరి రెండు సిటీల్లో ఉక్రెయిన్, రష్యా బలగాలకు మధ్య భీకర పోరాటం జరుగుతోంది. దాదాపు డాన్​బాస్ అంతటా రష్యన్ బలగాలు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తుండగా.. సెవెరోడోనెట్స్క్ లో ఉక్రెయిన్ బలగాలు దీటుగా పోరాడుతున్నాయి. మొదట ఈ సిటీని రష్యన్ ఆర్మీ ఆక్రమించుకోగా.. 20% ప్రాంతాన్ని తిరిగి పట్టు సాధించినట్లు శనివారం ఉక్రెయిన్ ప్రకటించింది. లిసిచాన్స్క్ సిటీలోనూ పోరాటం హోరాహోరీగా సాగుతోంది. ఈ రెండు సిటీలను పూర్తిగా ఆక్రమించుకుంటే లుహాన్స్క్ ప్రావిన్స్ అంతా తమ ఆధీనంలోకి వచ్చే అవకాశం ఉండటంతో రష్యన్ బలగాలు ఇక్కడ భారీ ఎత్తున దాడులకు పూనుకున్నాయి. సెవెరోడోనెట్స్క్‌‌ చుట్టూ రష్యా మళ్లీ బలగాలను మోహరిస్తోందని లుహాన్స్క్ గవర్నర్ చెప్పారు.  

లక్ష్యం చేరేదాకా దాడులు ఆగవు: రష్యా  

పశ్చిమ దేశాలు ఉక్రెయిన్​కు ఆయుధాలను అంది స్తూ అగ్నికి ఆజ్యం పోస్తున్నాయని రష్యా శనివారం మండిపడింది. ఆ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఉక్రెయిన్​ను డిస్ ఆర్మ్ చేయడంతో పాటు అక్కడి డేంజరస్ నేషనలిస్ట్​లను అంతం చేసేదాకా తమ స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కొనసాగి 
తీరుతుందని హెచ్చరించింది. 

మాక్రన్ పై ఉక్రెయిన్ ఫైర్ 

ఉక్రెయిన్ నుంచి రష్యన్ బలగాలను వెనక్కి తీసుకునేదాకా చర్చల ప్రసక్తేలేదని ఉక్రెయిన్ మరోసారి స్పష్టంచేసింది. రష్యాను మరింత అవమానించరాదని, దౌత్యపరంగా సమస్య పరిష్కారానికి ప్రయత్నించాలంటూ ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మాక్రన్ చేసిన సూచనను ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి దిమిత్రో కులేబా తిరస్కరించారు. మాక్రన్ చేసిన సూచన ఫ్రాన్స్​కు మాత్రమే కాకుండా అలాంటి సూచనలు ఇచ్చే ఇతర దేశాలకు కూడా అవమానమని అన్నారు.