తగ్గిన శిశు మరణాల రేట్

తగ్గిన శిశు మరణాల రేట్
  • ప్రతీ 36 పసివాళ్లలో ఒకరు
  • ఏడాదిలోపే చనిపోతున్నరు
  • రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా  డేటాలో వెల్లడి

న్యూఢిల్లీ: మన దేశంలో శిశు మరణాల రేటు తగ్గుతున్నప్పటికీ, ఇప్పటికీ పెద్ద సంఖ్యలోనే పిల్లలు చనిపోతున్నారని తాజా గణాంకాల్లో వెల్లడైంది. పుట్టిన ప్రతి 36 మందిలో ఏడాదిలోపే ఒకరు చనిపోతున్నారని తేలింది. బర్త్ రేటు, శిశు మరణాల రేటుపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా శనివారం కొత్త డేటా విడుదల చేసింది. 2020లో శిశు మరణాల రేటు 28శాతంగా నమోదైందని తెలిపింది. అంటే పుట్టిన ప్రతి వెయ్యి మందిలో 28 మంది ఏడాదిలోపే చనిపోతున్నారు. అయితే ఇది 1971తో పోలిస్తే చాలా తక్కువని, ఆ టైమ్ లో శిశు మరణాల రేటు 129గా ఉందని పేర్కొంది. గత పదేండ్లలో శిశు మరణాల రేటు 36% తగ్గిందని వెల్లడించింది. ఈ రేటు జాతీయ స్థాయిలో 44 నుంచి 28కి, రూరల్ ఏరియాల్లో 48 నుంచి 31కి, అర్బన్ ఏరియాల్లో 29 నుంచి 19కి తగ్గిందని తెలిపింది.

మరిన్ని వార్తల కోసం...

వైన్​ షాపుల నిర్వాహకుల కొత్త దందా

టూరిజం సెక్టార్ కళకళ