వికారాబాద్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసు దగ్గర యువకుడి ఆత్మహత్యాయత్నం

వికారాబాద్ జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసు దగ్గర యువకుడి ఆత్మహత్యాయత్నం
  • భూమి రిజిస్ట్రేషన్​ చేయడం లేదని యువకుడి మనస్తాపం

పరిగి, వెలుగు: తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా కులక్చర్ల తహసీల్దార్ కార్యాలయం వద్ద మంగళవారం మధ్యాహ్నం జరిగింది. కులక్చర్ల మండలం ఘనపూర్ గ్రామానికి చెందిన కురువ రామయ్య పేరుపై కులక్చర్ల గ్రామంలో ఐదెకరాల లావని పట్టా భూమి ఉంది. రామయ్య మృతిచెందడంతో ఆయన భార్య నరసమ్మ పేరుపై విరాసత్ చేయాలని అధికారులను కోరారు. లావని పట్టా కావడంతో అధికారులు ల్యాండ్ రిజిస్ట్రేషన్ నిలిపివేశారు.

బాధితులు కోర్టును ఆశ్రయించడంతో ఐదు ఎకరాలు నరసమ్మ పేరుపై విరాసత్ చేయాలని తీర్పు వచ్చింది. పంచనామా లేదని, విరాసత్ కింద రిజిస్ట్రేషన్ చేయడం కుదరని ఆర్ ఐ చెప్పడంతో నరసమ్మ కొడుకు నందకుమార్ మంగళవారం కులక్చర్ల తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. స్థానికులు గమనించి ఆయన చేతిలో నుంచి పెట్రోల్ బాటిల్ లాగేసుకున్నారు. పోలీసులు నందకుమార్​ను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కౌన్సెలింగ్​ ఇచ్చారు.