భద్రాచలం, వెలుగు : పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని అక్రమంగా అధిక ధరలకు అమ్ముతున్న ఆచంట వెంకట సీతామాధవరావు అనే వ్యక్తికి ఏడాది జైలు శిక్ష, రూ.1000 జరిమానాను విధిస్తూ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ శివనాయక్ బుధవారం తీర్పునిచ్చారు.
మెడికల్ కాలనీకి చెందిన ఆయనపై 2021 జూన్ 23న కేసు నమోదైంది. పీడీఎస్ బియ్యాన్ని ప్రభుత్వం నిరుపేదలకు అందిస్తుందని, ప్రజాప్రయోజనాలకు వ్యతిరేకంగా ముద్దాయి నేరం చేశారనే పరిగణనలోకి తీసుకుని శిక్ష విధించారు.
