గొడవ ఆపేందుకు వెళితే తల పగలగొట్టారు

గొడవ ఆపేందుకు వెళితే తల పగలగొట్టారు
  • జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో ఘటన

జూబ్లీహిల్స్, వెలుగు:  మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుప్పటి విషయంలో  గొడవపడుతున్న మిత్రులను ఆపేందుకు వెళ్లిన వ్యక్తిపై రాయితో తలపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. రహమత్‌నగర్‌కు చెందిన అజ్మీర్ పాషా (30) మద్యానికి అలవాటు పడి కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు.  పాషా, చంటి, రాజు, ప్రకాశ్‌లతో కలిసి కార్పెంటర్‌గా పనిచేస్తూ  ఫుట్‌పాత్‌పై నిద్రిస్తుంటాడు. 

 శనివారం రాత్రి యూసుఫ్‌గూడలోని సెలూన్ షట్టర్ వద్ద నిద్రిస్తున్న సమయంలో రాజు, ప్రకాశ్ మధ్య దుప్పటి విషయంలో గొడవ జరిగింది. వారిని ఆపేందుకు వెళ్లిన అజ్మీర్ పాషా తలపై ప్రకాశ్ పెద్ద రాయితో దాడి చేశాడు.  దీంతో అజ్మీర్ పాషా తీవ్రంగా గాయపడ్డాడు. మరో స్నేహితుడు  చంటి, పాషాను  గాంధీ ఆసుపత్రికి తరలించగా తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు.  ఈ ఘటనపై  మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.