హూస్టన్లో కాల్పులు.. నలుగురు మృతి

హూస్టన్లో కాల్పులు.. నలుగురు మృతి

అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్ లోని హూస్టన్ లో ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. తర్వాత పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా హతమయ్యాడు. హూస్టన్ సిటీలోని ఓ ఇంటికి దుండగుడు నిప్పంటించాడు. దీంతో అందులోని వారు బయటకు పరుగులు పెడుతుండగా.. వారిపై కాల్పులకు తెగబడ్డాడు.

కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయయ్యాయి. పోలీసుల కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడని సిటీ పోలీస్ చీఫ్ ట్రాయ్ ఫిన్నర్ ప్రకటించారు. ఈ ఘనటలో మొత్తం నలుగురు చనిపోయారన్నారు. బాధితులంతా 40 నుంచి 60 ఏళ్ల మధ్యవారని తెలిపారు. నిందితుడు ఆఫ్రికన్ – అమెరికన్  అని పోలీసులు చెప్పారు.