ఏటీఎంలో పెట్టాల్సిన రూ.5లక్షలను కొట్టేసి జల్సా చేసిండు

ఏటీఎంలో పెట్టాల్సిన రూ.5లక్షలను కొట్టేసి జల్సా చేసిండు

కంటోన్మెంట్, వెలుగు: ఏజెన్సీకు తెలియకుండా స్లిప్పులు మార్చి ఏటీఎంలో పెట్టాల్సిన రూ.5లక్షలను కొట్టేసిన ఎంప్లాయ్​ను హైదరాబాద్​లోని బోయినపల్లి పోలీసులు అరెస్టు​చేశారు. ఇన్​స్పెక్టర్ ​రవి కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లాలోని ఘనపూర్​కు చెందిన చోక్కం కృష్ణప్రసాద్(30) ఇంజినీరింగ్​చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. తర్వాత హైదరాబాద్​కు వచ్చి ఎస్.ఆర్.​నగర్​లో ఉంటూ సికింద్రాబాద్ నికల్సన్ రోడ్డులోని సీఎంఎస్​అనే ఏజెన్సీలో పని చేస్తున్నాడు. ఆ ఏజెన్సీ ద్వారా ఏటీఎంలలో క్యాష్​నింపుతుంటాడు. ఎప్పటిలాగే ఈ నెల 6వ తేదీన సికింద్రాబాద్ లోని వివిధ ఏటీఎంలలో క్యాష్ నింపేందుకు మేనేజర్ నుంచి రూ.49 లక్షలు తీసుకున్నాడు. సిబ్బందితో కలిసి వెహికల్​లో బయల్దేరాడు. అన్నింటిలో కలిపి రూ.44 లక్షలు నింపి రూ.లక్షలు కొట్టేశాడు. కృష్ణప్రసాద్​తో కలిసి పనిచేసే దేవేందర్ నుంచి ఏటీఎంలలో నింపిన రూ.47లక్షలకు సంబంధించిన స్లిప్పులు తీసుకుని ఏజెన్సీకి అందజేశాడు. తర్వాత జల్సా చేసేందుకు గోవా వెళ్లాడు. కొన్నిరోజుల తర్వాత తిరిగి సిటీకి వచ్చాడు.

మిస్సయిన డబ్బు గురించి అడిగేందుకు అంతకు ముందే ఏజెన్సీ మేనేజర్లు కృష్ణప్రసాద్​కు ఫోన్ చేయగా స్విచ్​ఆఫ్​వచ్చింది. అతనిపై అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న బోయినపల్లి పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా రూ.5లక్షలు కొట్టేసినట్లు ఒప్పుకున్నాడు.   రూ.3.70 లక్షలు ఇంట్లో దాచిపెట్టినట్లు చెప్పాడు. మిగితావి గోవాలో ఖర్చయినట్లు తెలిపాడు. రూ.3.70 లక్షలు స్వాధీనం చేసుకుని కృష్ణప్రసాద్​ను రిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు.