కడుపులో నోకియా ఫోన్.. స్కాన్‌ చేసిన డాక్టర్లు షాక్‌

కడుపులో నోకియా ఫోన్.. స్కాన్‌ చేసిన డాక్టర్లు షాక్‌

బాగా ఆక‌లి వేసిందో.. లేక మ‌త్తులో ఉన్నాడో తెలియ‌దు కానీ, ఏకంగా నోకియా ఫోన్‌ను మింగేశాడు ఓ వ్యక్తి. దానిని అలాగే క‌డుపులో ఉంచుకుని నాలుగు రోజులు గ‌డిపేశాడు. చివ‌ర‌కు ప్రాణం మీద‌కు వ‌చ్చేస‌రికి హాస్పిట‌ల్ మెట్లెక్కాడు. ఐరోపా దేశమైన కొసోవోలో ఈ ఘ‌ట‌న జరిగింది.కొసోవోలోని ప్రిస్టినాకు చెందిన ఓ వ్యక్తి కొద్ది రోజుల క్రితం నోకియా 3310 ఫోన్‌ను మింగేశాడు. క‌డుపులో నొప్పి పెడుతున్నా నాలుగు రోజుల పాటు అలాగే ఉండిపోయాడు. నొప్పి దారుణంగా పెరిగే స‌రికి హాస్పిట‌ల్‌కు వెళ్లాడు. త‌నకు క‌డుపు నొప్పి ఎక్కువగా ఉందని మాత్రమే డాక్టర్లకు చెప్పాడు. స్కానింగ్, ఎండోస్కోపీ టెస్టులు చేసిన డాక్టర్లు క‌డుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించి షాక్ తిన్నారు. దీంతో ఏడుగురు డాక్టర్ల టీమ్‌ కలిసి సర్జరీ చేసి అతడి కడుపులో ఉన్న ఫోన్‌ను బయటకు తీశారు.

 

NXJERRJA E TELEFONIT NGA STOMAKU Mashkulli 33 vjec para 4 ditesh kishte perbire nje telefon te vogel. Me rruge endoskopike, pra pa e prere lukthin, nxorrem telefonin e ndare ne tri pjese. Pa komplikime.

Posted by Skender Telaku on Monday, August 30, 2021

దీనిపై డాక్టర్ స్కెన్‌డ‌ర్ టెల్జా మాట్లాడుతూ.. అత‌డికి స్కాన్ ప‌రీక్షలు నిర్వహించిన త‌ర్వాత క‌డుపులో ఫోన్ ఉన్నట్లు గుర్తించామని, అది క‌డుపులో మూడు ముక్కలుగా ఉందని చెప్పారు. అన్నింటిని ఈజీగా బయటకు తీశామని, బ్యాట‌రీని చాలా జాగ్రత్తగా తీయాల్సి వచ్చిందని, ఏ మాత్రం తేడా వచ్చినా అది కడుపులో పేలి ప్రాణాలకే ముప్పు వచ్చేదని డాక్టర్‌‌ తెలిపారు. మొత్తానికి ఫోన్ పార్ట్స్‌ అన్నీ బయటకు తీసి అతడిని కాపాడామన్నారు. అయితే, ఆవ్యక్తి అసలు ఆ ఫోన్‌ ఎందుకు మింగాడనేది తెలియరాలేదు.