
హైదరాబాద్ : ప్రేమను నిరాకరిస్తే తల్లి దండ్రులను చంపేస్తానని యువతిని బెదిరించిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.హైదరాబాద్ కి చెందిన ప్రసాద్ అనే యువకుడు కొన్ని నెలలుగా ప్రేమించాలని ఓ అమ్మాయి వెంటపడుతూ వేధిస్తున్నాడు. తన ప్రేమను నిరాకరిస్తే నీ తల్లి దండ్రులను చంపేస్తానని యువతికి బెదిరింపులు చేశాడు. దీంతో యువతి తండ్రి సాయంతో పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాచకొండ పోలీసులు ప్రసాద్ అరెస్ట్ చేశారు. ప్రసాద్ పిల్లిగుడ్ల ప్రాంతానికి చెందిన వ్యక్తిగా గుర్తించాన్నారు.