- ముఖం కడుక్కుంటూ రైలు కిందపడ్డాడు
వికారాబాద్, వెలుగు: రైలులో నుంచి జారిపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన వికారాబాద్ రైల్వేస్టేషన్లో జరిగింది. రైల్వే హెడ్‌కానిస్టేబుల్ హరిప్రసాద్తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం అంతారం గ్రామానికి చెందిన మహేశ్(23) ఓ కాంట్రాక్టర్ వద్ద ఎలక్ట్రీషియన్‌గా చేస్తున్నాడు. సోమవారం ఉదయం వికారాబాద్ నుంచి తాండూరు వెళ్లేందుకు వికారాబాద్ రైల్వేస్టేషన్లో పర్భని–రాయచూర్ రైలెక్కాడు.
డోర్ పక్కన వాష్బేసిన్లో ముఖం కడుక్కుంటూ జారి రైలు కింద పడిపోయాడు. రైలు చక్రాలు వెళ్లడంతో అతని రెండు కాళ్లు నుజ్జునుజ్జయ్యాయి. రైల్వే పోలీసులు బాధితుడిని వికారాబాద్హాస్పిటల్కు తరలించగా డాక్టర్లు అతని రెండు కాళ్లను తొలగించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మహేశ్‌ను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. పరీక్షించిన డాక్టర్లు అతను మృతిచెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే హెడ్ కానిస్టేబుల్ పేర్కొన్నారు.
