ఎందుకు రా ఈ జీవితం... సినిమా హాల్లో కూడా ఆఫీసు పనే...

ఎందుకు రా ఈ జీవితం... సినిమా హాల్లో కూడా ఆఫీసు పనే...

కరోనా పుణ్యమా అని వర్క్​ ఫ్రం హోం కల్చర్​ మొదలైంది.  ఐటీ ఉద్యోగస్తులు ఎక్కడ కనపడినా ల్యాప్​ టాప్​, స్మార్ట్​ ఫోన్లతో దర్శనమిస్తున్నారు.  తాజాగా బెంగళూరులో  ఓ ఐటీ ఉద్యోగి సినిమా ధియేటర్​ లో ల్యాప్​ టాప్​ లో వర్క్ చేస్తూ కనిపించాడు.  ఎక్కడైనా ఐటీ  ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంటుందని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. 

ప్రస్తుతం  ఆఫీసు పనిభారం ఉద్యోగస్తులను నీడలా వెంటాడుతుంది. ఇల్లు అయినా, ఆఫీసు అయినా వారి పని ఎప్పటికీ ముగియదు. సెలవులో ఉన్నప్పటికీ... ల్యాప్ టాప్ ద్వారా  ఇంటి నుండి పని చేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ దాన్ని మరింత చెడగొట్టింది. ఆఫీసులో 8-9 గంటల్లో డ్యూటీ అయిపోతుంది. కరోనా పుణ్యమా అని   వర్క్ ఫ్రమ్ హోమ్  మొదలైంది. మొదట్లో ఇది బాగానే ఉన్నా.. తరువాత మాత్రం జనం జీవితం మర్చిపోయే  పరిస్థితి ఏర్పడింది. వ్యక్తిగత ఈవెంట్ లు  కుటుంబ సమావేశాలలో కూడా...  ఫోన్ లు, ల్యాప్ టాప్ లతో  బిజీగా ఉంటున్నారు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన వీడియోలో ఒక వ్యక్తి సినిమా థియేటర్లో ల్యాప్ టాప్ లో పనిచేస్తున్నట్లు కనిపించాడు. ఇది చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.  ప్రతిచోటా ఐటీ నిపుణుల పరిస్థితి ఇదే అని ప్రజలు  అంటున్నారు. ఈ వీడియోకు 44 వేల  కంటే ఎక్కువ లైక్ లు వచ్చాయి.

థియేటర్ లో  ల్యాప్ టాప్ లో పని
 
వైరల్ వీడియోలో, ఒక వ్యక్తి సినిమా హాల్ లో కూర్చుని ల్యాప్ టాప్ లో పనిచేస్తున్నాడు.  ఐటి నిపుణుల ఒత్తిడిని ప్రపంచానికి చాటేలా ఓ ప్రేక్షకుడు ఈ దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు.  ఐటి హబ్ గా పిలువబడే బెంగళూరులోని ఓ కంపెనీలో  టెక్నికల్ ఫీల్డ్ లో పనిచేసే వ్యక్తులు ల్యాప్ టాప్ తో తమ పనులన్నింటినీ చేయాలి. అందుకే కంపెనీ వారికి ల్యాప్ టాప్ ప్రొవైడ్​ చేస్తుంది.  ఎప్పుడు  పని పంపినా, చేయాల్సిన గడువు కూడా చెబుతారు. ఇలాంటి పరిస్థితిలో అలాంటి వారు రోజులో ఎక్కువ సమయం ల్యాప్​ టాప్ లతోనే గడుపుతున్నారు.  కొంతమంది అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు.. ల్యాప్​ టాప్​ కే తాళి కట్టక పోయావా అన్న సెటైర్లు కూడా వినపడుతున్నాయి.  

ఐటీ నిపుణుల జీవితం ఇలాగే ... 

సినిమా ప్రారంభం కావడానికి మరికొంత సమయం ఉందని వీడియోలో చూడవచ్చు.  ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ఓపెన్ చేసి కనిపించాడు. అతని ల్యాప్ టాప్ పని చాలా ముఖ్యమైనదని దాని నుండి అర్థమైంది.  అతను సినిమా చూసి ఎంజాయి చేద్దామని వచ్చినా ఆఫీసు కార్యకలాపాలు వెంటాడుతూనే ఉన్నాయి. దీనిపై  చాలా మంది తమ అభిప్రాయాన్నికామెంట్ల  తెలియజేశారు. ఇది చూడటానికి బెంగళూరుకు ఎందుకు వెళ్లాలి, కేరళలో కూడా ఇది కనిపించింది' అని ఒకరు రాశారు. మరొకరు  డెడ్ లైన్ వచ్చి ఉండాలి అని రాశారు. 

సినిమా చూడటానికి అదే థియేటర్‌లో ఉన్న మిగతా ప్రేక్షకులు ఈ వ్యక్తి తన ల్యాప్‌టాప్‌తో థియేటర్ లోపల కూర్చున్న క్షణాన్ని రికార్డ్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగుళూరు మలయాళీలు అనే ఇన్‌స్టాగ్రామ్ ID నుండి ఈ ఆసక్తికరమైన వీడియో ఏప్రిల్ 10 న షేర్‌ చేయబడింది. ఈ వీడియోకి ఇప్పటివరకు 6 లక్షలకు పైగా వీక్షణలు వచ్చాయి. బెంగుళూరులో టెక్కీ జీవితం అంటూ వీడియోతో పాటు క్యాప్షన్ కూడా ఇచ్చారు