
కోల్‌బెల్ట్,వెలుగు: సింగరేణి ఎస్సీ, ఎస్టీ లైజన్ఆఫీసర్లను నియమిస్తూ యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. సింగరేణి వ్యాప్తంగా ఏడు ఏరియాలకు కొత్త లైజన్ఆఫీసర్లను నియమించింది. శ్రీరాంపూర్ ఏరియాకు డీజీఎం ఆనంద్‌కుమార్, ఎస్టీపీపీ ఏరియాకు డీజీఎం జనగామ శ్రీనివాస్, మందమర్రి ఏరియాకు ఈఎం ఎస్ఈ చంద్రమౌళి, బెల్లంపల్లి ఏరియాకు సీనియర్పీవో డి.ప్రసాంత్, కొత్తగూడెం కార్పొరేట్ఏరియాకు డీవైసీఎంవో కొమ్ము మాలతి, రామగుండం-–2 ఏరియాకు డీజీఎం ఎస్.సంతోష్‌కుమార్, రామగుండం-–3 ఏరియాకు అడిషనల్మేనేజర్జి.మహేశ్నియమితులయ్యారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు సంబంధించిన ప్రమోషన్లు,ఇతర సమస్యల పరిష్కారానికి లైజన్ఆఫీసర్లు చొరవ చూపాలని సింగరేణి ఎస్సీ,ఎస్టీ ఉద్యోగుల సంఘం కోరింది.