కరోనా లాక్ డౌన్ నుండి పెద్ద పెద్ద ఐటి కంపెనీల నుండి చిన్న సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కలర్చర్ తీసుకొచ్చాయి. అయితే గత ఏడాది నుండి కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పద్దతికి గుడ్ బై చెప్పిన కొన్ని కంపెనీలు ఇప్పటికి పాటిస్తున్నాయి. అయితే కొందరు ఉద్యోగుల వర్క్ ఫ్రమ్ హోమ్ తీరుపై మేనేజర్లు మండిపడుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తూ, లక్షకు పైగా జీతం తీసుకుంటూ కూడా ఆఫీస్ వర్కింగ్ హావర్స్ లో కూడా సరిగ్గా పనిచేయకుండా సాకులు చెబుతూ తప్పించుకుంటున్నారు అని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి సంబంధించి ఓ కంపెనీ మేనేజర్ చేసిన పోస్ట్ ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ (WFH) చేసే ఉద్యోగుల గురించి పెద్ద చర్చకు దారితీసింది. రిమోట్ గా పని చేసే ఉద్యోగులు WFH సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మేనేజర్ తీవ్రంగా ఆరోపించారు. కరెంటు లేకపోవడం వల్ల కాల్ అటెండ్/లిఫ్ట్ చేయలేకపోతున్న అనేది నేను అస్సలు ఒప్పుకోలేని సాకు అంటూ మేనేజర్ చేసిన పోస్ట్ లో స్పష్టం చేశారు.
ఏడుగురు ఉన్న టీంలో ఇద్దరు ఉద్యోగులు మాత్రం ప్రతిసారి నెట్‌వర్క్ సమస్య ఉంది లేదా కరెంట్ లేదు అని మెసేజ్ పెడుతూ గంటల తరబడి ఆఫీస్ వర్కింగ్ టైం ఎగ్గొడుతున్నారు అని మేనేజర్ పేర్కొన్నారు. అప్పుడప్పుడు నెట్‌వర్క్ సమస్యలు రావడం సహజమే, కానీ వారాల తరబడి అలానే జరిగితే, ఇంటర్నెట్ ప్రొవైడర్/కనెక్షన్ మార్చుకోవచ్చు కదా? అని ప్రశ్నించారు.
ఈ ఇద్దరూ ఉద్యోగులు పన్నులు పోనూ నెలకు రూ.1.5 లక్షలకు పైగా మంచి జీతం తీసుకుంటున్నారు. ఇంత సంపాదిస్తున్నా కూడా రూ.1000 ఖర్చు చేసి యూపీఎస్ (UPS) కొనలేరా... అంటూ ఇలాంటి సమస్యలు చెబుతున్నారని విమర్శించారు.
ల్యాప్‌టాప్ ఛార్జింగ్ లేదు అని సాకులు చెప్పేవారిని కూడా ఈ పోస్ట్ ద్వారా టార్గెట్ చేసారు. మా కంపెనీ అందరికీ ఆపిల్ మ్యాక్‌బుక్ ప్రోలు ఇచ్చింది. ఎవరైనా బ్యాటరీ అయిపోయిందని చెబితే, వారు అజాగ్రత్తగా ఉన్నారని లేదా అబద్ధం చెబుతున్నారని అర్థం అని మేనేజర్ పోస్టులో రాశారు. పదేపదే ఇలా పని ఎగ్గొట్టడం వల్ల యాజమాన్యం మీ పై ఫోకస్ పెడుతుంది. అప్పడు ఇక భవిష్యత్తులో WFH పాలసీకి ముప్పు రావచ్చని హెచ్చరించారు.
ఈ రెడ్డిట్ పోస్ట్ పై నెటిజన్ల కామెంట్స్:
మేనేజర్ చేసిన ఈ పోస్ట్‌కి సోషల్ మీడియాలో బాగానే కామెంట్స్ వచ్చాయి. చాలా మంది యూజర్లు మేనేజర్ మాటలను ఒప్పుకుంటూ, కొంతమంది ఉద్యోగులు WFH ఫ్లెక్సిబిలిటీని లైట్ తీసుకుంటున్నారని అంగీకరించారు.
ఒకతను కంపెనీలో కూడా ఇలాంటి సాకులు చెప్పడం వల్ల WFH పాలసీ తీసేస్తున్నట్లు తెలిపారు. మరొక యూజర్ కొందరు ఉద్యోగుల సాకుల కారణంగా మేనేజర్ మిగతా వారికి సెలవులు ఇవ్వడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకో యూజర్ ఒక ఉద్యోగి నెట్ రావడం లేదని తీసిన స్క్రీన్‌షాట్‌నే ప్రతిసారి చూపిస్తూ ఇంటర్నెట్ సమస్యగా ఉందని చెబుతున్నట్లు చెప్పారు.
అయితే, ఒకతను మేనేజర్ మాటలు చాలా కఠినంగా ఉన్నాయని విమర్శించారు. చిన్న నగరాల్లో మౌలిక సదుపాయాలు, తరచుగా ఉండే విద్యుత్ కోతలు వంటి నిజమైన సమస్యలను మేనేజర్ పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడ్డారు.
