అక్టోబర్ 31 లోగా సీఎంఆర్ పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

అక్టోబర్ 31 లోగా సీఎంఆర్ పూర్తి చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్

నస్పూర్, వెలుగు: రబీ సీజన్ కు సంబంధించినసీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31లోగా పూర్తి చేయాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్లో అడిషన ల్ కలెక్టర్ పి.చంద్రయ్య, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీక ళతో కలిసి అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రైస్ మిల్లర్లతో సీఎంఆర్ లక్ష్యాలపై సమీక్ష నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ.. 2024-25 రబీ సీజన్కు సంబంధించిన సీఎంఆర్ లక్ష్యాలను అక్టోబర్ 31లోగా పూర్తి చేసేలా అధికారులు, రైస్ మిల్లర్లు సమన్వయం తో కృషి చేయాలన్నారు. రైస్ మిల్లర్లు తమకు కేటాయించిన ధాన్యాన్ని ప్రతి రోజు మిల్లింగ్ చేసి సీఎంఆర్చేయాలని, గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయని మిల్లులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, రైస్ మిల్లర్ల సంఘం ప్రతి నిధులు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు