- డీఎంహెచ్వో అనిత
మంచిర్యాల, వెలుగు: అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్య సిబ్బంది సమయపాలన పాటించి ప్రజలకు అందుబాటులో ఉండాలని మంచిర్యాల జిల్లా డీఎంహెచ్వో అనిత ఆదేశించారు. నస్పూర్‌లోని పీహెచ్సీలో శుక్రవారం జరిగిన జాతీయ ఆరోగ్య కార్యక్రమాల రివ్యూలో ఆమె పాల్గొన్నారు. మాతాశిశు సంరక్షణలో భాగంగా గర్భిణుల నమోదు టార్గెట్ ను పూర్తిచేయాలన్నారు.
గర్భిణులను స్కానింగ్ కేంద్రానికి తరలించి పరీక్షలు చేయించాలన్నారు. సాధారణ ప్రసవాల కోసం అవగాహన కల్పించాలని, సీ సెక్షన్లు చేసుకుంటే వాటి వల్ల వచ్చే అనర్థాలను తెలియజేయాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అన్ని వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. బుధవారం, శనివారం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆరోగ్య కార్యకర్తలు పిల్లల వివరాలు సేకరించాలన్నారు. డాక్టర్ వెంకటేశ్, ఆశా, ఆరోగ్య కార్యకర్తలు ఉన్నారు.
