జైపూర్, వెలుగు: రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభించిన మోడీ మీటింగ్ కోసం మంచిర్యాల జిల్లా నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. కార్యకర్తలు, లీడర్లను మాజీ ఎంపీ, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి జైపూర్మండలం ఇందారం వద్ద స్వాగతం పలికారు. కార్యక్రమంలో చెన్నూర్ నియోజకవర్గ ఇన్చార్జి అందుగుల శ్రీనివాస్ , జైపూర్, భీమారం మండలాల పార్టీ ప్రెసిడెంట్లు చల్ల విశ్వంబర్‌రెడ్డి, వేల్పుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్లు తాళ్లపల్లి కిరణ్ గౌడ్ , బెల్లం కొండ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేద్రం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్వెరబెల్లి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీగా సభకు తరలివెళ్లారు. అంతకుముందు ర్యాలీని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగా రెడ్డి పార్టీ జెండా ఊపి ప్రారంబించారు.
రైతుల సంక్షేమానికి బీజేపీ సర్కార్ కృషి
భైంసా,వెలుగు: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భోస్లే మోహన్ రావు పటేల్చెప్పారు. శనివారం ముథోల్ మండలం తరోడా వ్యవసాయ క్షేత్రంలో నిర్వహించిన కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. అంతకుముందు మోడీ ఫొటోకు క్షీరాభిషేకం చేశారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రధాని మోడీ జాతికి అంకితం చేసే కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో తెలంగాణ రైతులకు సరిపడా యూరియా ఉత్పత్తి అవుతోందని, దీంతో ఈ ప్రాంత రైతులు ఇబ్బందులు దూరమవుతాయన్నారు. బోధన్, -బాసర, -భైంసా డబుల్ రోడ్డును అభివృద్ధి చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. మోడీ సర్కార్అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సుభాష్ జాదవ్, కౌన్సిలర్లు కపిల్ సిందే, దశరథ్, లీడర్లు గాలి రవి కుమార్, దిలీప్, సాయినాథ్, రామకృష్ణ, మాధవ్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.
రాజీవ్ స్వగృహ ప్లాట్లు మాకే ఇవ్వాలి
ఆదిలాబాద్, వెలుగు: రాజీవ్‌స్వగృహ వేలం పాటలో మొదటి ప్రాధాన్యం తమకే ఇవ్వాలని దరఖాస్తుదారులు డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని విద్యుత్ తరంగణి లో సమావేశం నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. 2007లో రూ.3 వేల చొప్పున డీడీలు కట్టినా ఇప్పటి వరకు కేటాయించకపోవడం ఎంతవరకు సబబన్నారు. దీనిపై హైకోర్టులో పిటిషన్‌కూడా దాఖలు చేశామన్నారు. కలెక్టర్, ఆఫీసర్లు చొరవచూపి వేలం పాటలో ప్రభుత్వం నిర్ణయించిన ధరకంటే తక్కువకు తమకు ప్లాట్లు విక్రయించాలన్నారు. లేదంటే నిరాహారదీక్ష చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో బాధితులు శివకుమార్, సామ సంతోష్ రెడ్డి, మనోజ్ రెడ్డి, రంగాచార్య, తులసిరామ్, దూదరాం పాల్గొన్నారు.
రాజీవ్ స్వగృహ ప్లాట్లకు 459 అప్లికేషన్లు
మావల శివారులోని రాజీవ్ స్వగృహ ప్లాట్ల వేలం కోసం దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. శనివారం వరకు 459 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 14 నుంచి 18 వరకు ఆఫీసర్లు బహిరంగ వేలం పాట నిర్వహించనున్నారు.
కార్తీక దీపోత్సవం
ఆదిలాబాద్ మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో శనివారం కార్తీక దీపోత్సవం కన్నుల పండగ సాగింది. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. దీపోత్సవానికి ఎమ్మెల్యే రామన్న దంపతులు హాజరయ్యారు. కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యులు సుజాత దంపతులు, మున్నూరుకాపు సంఘం అధ్యక్షుడు విఠల్ దంపతులు, ప్రధాన కార్యదర్శి కాలల్ సీను దంపతులు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్,ఆదిలాబాద్
యువత క్రీడల్లో రాణించాలి
నార్నూర్,వెలుగు: యువత విద్యతో పాటు క్రీడల్లో రాణించాలని ఐటీడీఏ పీవో కె. వరుణ్ రెడ్డి కోరారు. శనివారం ఉట్నూరు మండలం లాల్ టేకిడి గురుకులంలో ట్రైబల్ వెల్ఫేర్ రాష్ట్రస్థాయి క్రీడోత్సవాలను ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖాశ్యామ్ నాయక్ తో కలిసి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. క్రీడలు మానసిక ఒత్తిడిని దూరం చేస్తాయన్నారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల విద్యాలయాలకు ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కార్యక్రమంలో గురుకులం జాయింట్ సెక్రటరీ విజయలక్ష్మి, రీజినల్ కోఆర్డినేటర్ లక్ష్మయ్య, ఆర్సీవో గంగాధర్, క్రీడాధికారులు ఈడీ రవికుమార్, జయం, రమేశ్ కుమార్, ప్రిన్సిపాల్ రాంమోహన్, సర్పంచ్ శ్రీహరి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
భైంసా,వెలుగు: ట్రిపుల్ఐటీ విద్యార్థులు బాగా చదవి ఉన్నత స్థాయికి చేరుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్పార్థసారధి సూచించారు. శనివారం బాసర ట్రిపుల్‌ఐటీలో పర్యటించి కలెక్టర్ ముషారఫ్‌అలీ ఫారూఖీ, ఇన్చార్జి వీసీ వెంకటరమణ, అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, డైరెక్టర్ సతీశ్‌కుమార్, ఏఎస్పీ కిరణ్ ఖారేతో కలిసి ఎకో పార్కును ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు. ప్రతీ విద్యార్థి కష్టపడే తత్వం అలవర్చుకోవాలన్నారు. లక్ష్యసాధన కోసం దేనినైనా ఎదిరించాలన్నారు. అనంతరం జ్ఞాన సరస్వతి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
రైతును రాజు చేయడమే లక్ష్యం
భైంసా, వెలుగు: రైతును రాజు చేయడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి చెప్పారు. శనివారం స్థానిక హరియాలీ ఫంక్షన్ హాల్లో ప్రధాని మోడీ ప్రసంగాన్ని రైతులతో కలిసి చూశారు. పంటల సాగులో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని పునరుద్ధరించారన్నారు. కార్యక్రమంలో జిల్లా సహ ఇన్చార్జి మ్యాన మహేశ్, జిల్లా ప్రధాన కార్యదర్శి పడిపెల్లి గంగాధర్, పట్టణ అధ్యక్షుడు మల్లేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు తాలోడ్ శ్రీనివాస్, భూషణ్, బాలాజీ పటేల్ తదితరులు పాల్గొన్నారు.
రైతుల సంక్షేమానికి ప్రధాని పెద్దపీట
ఖానాపూర్,వెలుగు: రైతుల సంక్షేమానికి మోడీ సర్కార్ పెద్ద పీట వేస్తోందని బీజేపీ ఖానాపూర్ నియోజకవర్గ లీడర్అజ్మీరా హరినాయక్, అసెంబ్లీ కన్వీనర్ పడాల రాజశేఖర్ చెప్పారు. శనివారం ఖానాపూర్ మండలం మస్కాపూర్ గ్రామంలోని ఎల్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతో రైతులకు ఎంతో మేలుజరుగుతుందన్నారు. కార్యక్రమంలో లీడర్లు ఉపేందర్, శ్రావణ్, ప్రకాశ్, సదాశివ, లక్ష్మణ్, మనోజ్, సురేశ్, గిరి, సాయి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
మోడీ సభను అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటు
ఆదిలాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ సభను అడ్డుకోవాలనుకోవడం సిగ్గుచేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ చెప్పారు. శనివారం టీఎన్జీవో భవనంలో నరేంద్ర మోడీ రామగుండం కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించి ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి ఎంతో కృషిచేస్తోందన్నారు. కార్యక్రమంలో లీడర్లు దయాకర్, లోక ప్రవీణ్ రెడ్డి, జోగు రవి, ఆకుల ప్రవీణ్, సుహాసిని రెడ్డి, ధోని జ్యోతి, దినేశ్, మాటోలియ, మహేందర్ పాల్గొన్నారు.
