రెండు నెలల తర్వాత మంచిర్యాలకు పీఎస్సార్

రెండు నెలల తర్వాత మంచిర్యాలకు పీఎస్సార్
  •     స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు 
  •     పంచాయతీ ఎన్నికలపై తన నివాసంలో సమీక్ష 

మంచిర్యాల, వెలుగు:  కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు దాదాపు రెండు నెలల తర్వాత నియోజకవర్గానికి వచ్చారు. ఆయనకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు స్వాగతం పలికారు. 

దసరా తెల్లారి అక్టోబర్ 3న అనారోగ్యంతో పీజేఆర్​హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. అక్కడ నెలరోజుల పాటు చికిత్స పొందిన అనంతరం కోయంబత్తూర్ లోని మరో హాస్పిటల్​లో దాదాపు 20 రోజులు ట్రీట్​మెంట్ తీసుకున్నారు. కొద్దిగా కోలుకోవడంతో వారం క్రితం హైదరాబాద్ వచ్చారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆయన గురువారం మధ్యాహ్నం ప్రత్యేక హెలికాప్టర్ లో మంచిర్యాలకు చేరుకున్నారు. నస్పూర్ లోని ఐడీఓసీ ఆవరణలో గల హెలిపాడ్ లో ల్యాండ్ అయ్యారు. 

అక్కడి నుంచి కారులో మంచిర్యాలలోని తన నివాసం వరకు ర్యాలీగా వెళ్లారు. అనంతరం పంచాయతీ ఎన్నికలపై పార్టీ నాయకులతో సమీక్షించారు. కాలుకు సర్జరీ కావడంతో ప్రస్తుతం ఆయన నడిచే పరిస్థితిలో లేరని, వీల్ చైర్ సాయంతోనే కదులుతున్నారని నాయకులు తెలిపారు.