
మంచిర్యాల, వెలుగు: దసరా పండుగను దృష్టిలో పెట్టుకొని మున్సిపల్ కాంట్రాక్ట్వర్కర్లకు ఈనెల 25లోపే జీతాలు చెల్లించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు సుదమల్ల హరికృష్ణ కోరారు. మంగళవారం మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంపత్‌కుమార్‌ను కలిసి వివిధ సమస్యలపై మెమోరాండం అందజేశారు.
60 సంవత్సరాలు నిండిన వర్కర్ల స్థానంలో వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. 60 ఏండు పైబడిన వారికి పీఎఫ్, ఈఎస్ఐ కట్ కాకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగితే బెనిఫిట్స్ పొందే అవకాశం లేదన్నారు. ఈనెలాఖరులోగా వారికి పీఎఫ్, ఈఎస్ఐ కల్పించాలన్నారు. అలాగే నస్పూర్‌లో, విలీన గ్రామాల్లో పనిచేస్తున్న వారికి పీఎఫ్, ఈఎస్ఐ అకౌంట్లు వెంటనే ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు.