Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో గొడవలు.. విష్ణు, మనోజ్ మధ్య స్టేటస్ వార్

Manchu Family Issue : మంచు ఫ్యామిలీలో గొడవలు.. విష్ణు, మనోజ్ మధ్య స్టేటస్ వార్

మంచు ఫ్యామిలీలో గొడవలు రచ్చకెక్కాయి. చాలాకాలంగా మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు జరుగుతున్నాయని, ఈ ఇద్దరు ఎడ మొహం, పెడ మొహంగా ఉంటున్నారని వస్తోన్న వార్తలకు మరింత బలం చేకూరుస్తూ ఓ వీడియో బయటపడింది. అన్నదమ్ములు విష్ణు, మనోజ్ గొడవ పడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోని మనోజ్ తన ఫేస్ బుక్ స్టేటస్ లో  పోస్ట్ చేయడంతో వివాదం రోడ్డెక్కింది. విష్ణు.. మనోజ్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉంటున్న సారథి అనే వ్యక్తి ఇంటికి వెళ్లి గొడవ పడటం.. అన్నదమ్ముల మధ్య ఆజ్యం పోసింది.అయితే, సారథికి విష్ణుతో పడకపోవడంతో.. విష్ణు గొడవకు వచ్చినట్లు తెలుస్తోంది.  

సారథితో అన్న విష్ణు గొడవను స్టేటస్‌గా పెట్టాడు మనోజ్‌. మనోజ్‌ ఫేస్‌బుక్ స్టోరీ పోస్ట్‌తో ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. వారి మధ్య విబేధాలను బయటపెట్టింది. ఇళ్లలోకి చొరబడి ఇలా తనవాళ్లను, బంధువులను కొడుతూ ఉంటాడంటూ విష్ణుపై మనోజ్ సీరియస్ అయ్యాడు. తన మనిషి సారథిని కొట్టాడంటూ మనోజ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.

సారథి ఇంటికెళ్లిన విష్ణు.. ‘నా ఇష్టం’ అని అంటాడు. మరో వైపు ‘ఇదండి అసలు విషయం ఇలా ఇంటికి వచ్చి మా వాళ్లను కొడుతుంటాడు’ అంటూ మరో వైపు మనోజ్ అంటున్నాడు. అసలు వీరి మధ్య గొడ‌వేంటో తెలియాల్సి ఉంది. అన్నదమ్ముల గొడవపై తండ్రి మోహన్ బాబు ఇంకా స్పందించలేదు.. అదే విధంగా అన్ని విషయాలపై ఎంతో చురుగ్గా స్పందించే సోదరి మంచు లక్ష్మి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.

అయితే, గత కొంతకాలంగా అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని, అందుకే మనోజ్ పెళ్లిలో  విష్ణు చుట్టం చూపుగా వచ్చి వెళ్లాడనే వార్తలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై స్పందించిన మోహన్ బాబు.. ఆ వార్తల్లో నిజం లేదని ఇప్పటివరకు తను ఆస్తి పంపకాలు ఏమీ చేయలేదని, ఇద్దరు కూడా వాళ్ల సొంత సంపాదన తోనే బతుకుతున్నారని చెప్పుకొచ్చారు.