
టాలీవుడ్ నటి మంచు లక్ష్మి(Manchu Lakshmi) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాజాగా జనసేన(Janasena) నేత పవన్ కళ్యాణ్(Pawan kalyan) రాబోయే ఎన్నికల్లో టీడీపీ(TDP)తో కలిసి పోటీ చేస్తామని తేల్చిచెప్పేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై ట్విట్టర్ వేదికగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మంచు లక్ష్మి. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఇటు ఇండస్ట్రీలో, అటు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఇటీవల పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కలవడానికి రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్.. నారా లోకేష్, నందమూరి బాలకృష్ణ సమక్షంలో జనసేన, టిడిపి పార్టీలు వచ్చే ఎన్నికల్లో కలసి పోటీ చేస్తాయని అధికారికంగా ప్రకటించారు.
Woah!!! AP politics just got super interesting..
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) September 15, 2023
Also Read :- సల్మాన్ ఖాన్ జోడీగా సమంత.. భారీ స్కెచ్ వేసిన కరణ్ జోహార్
దీంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం ఒక్కసారిగా హీటెక్కాయి. తాజా పరిణామాలతో జనసేన, తెలుగు దేశం పార్టీ క్యాడర్ జోష్ లో ఉండగా.. వైసిపి నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిణామంపై మంచు లక్ష్మి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ట్విట్టర్ వేదికగా.. వావ్ ఇప్పుడు ఏపీ రాజకీయాలు మరింత మజా ఇచ్చేలా మారాయి.. అంటూ రాసుకొచ్చారు. దీనిపై నెటిజన్లు రియాక్ట్ అవుతూ.. మీ ఫ్యామిలీ ఏ పార్టీకి మద్దతు ఇస్తున్నారు అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం మంచు లక్ష్మి చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.