Bhairavam X Review: ‘భైరవం’ X రివ్యూ.. మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

Bhairavam X Review: ‘భైరవం’ X రివ్యూ.. మూవీ పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ లీడ్ రోల్స్‌‌లో నటించిన  చిత్రం ‘భైరవం’(Bhairavam). తమిళ్‌లో సూరి హీరోగా వచ్చిన ‘గరుడన్’మూవీకి ఇది రీమేక్. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కెకె రాధామోహన్ నిర్మించారు.

ఇవాళ శుక్రవారం (మే 30న) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, సాంగ్స్, ప్రమోషన్స్, వివాదాలతో  అంచనాలు పెంచిన భైరవం కథేంటీ? సోషల్ మీడియాలో పబ్లిక్ టాక్ ఎలా ఉందనే విషయాలు X రివ్యూలో తెలుసుకుందాం. 

‘భైరవం’మూవీలో యాక్షన్ సీన్స్, రక్తపాతం ఎక్కువగా ఉండడం వల్ల A సర్టిఫికెట్ లభించింది. 18 సంవత్సరాలు పైబడిన పెద్దలు మాత్రమే చూడాలి. సో, చిన్నపిల్లలు ఈ సినిమాకి దూరంగా ఉండాలన్నమాట. అయితే, ఇపుడు ‘భైరవం’మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

గరుడన్’మూవీలోని మూలకథను తీసుకుని, దాన్ని తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్చిన డైరెక్టర్, ఎమోషన్స్‌ని బాగా వర్కవుట్ చేశాడని నెటిజన్స్ అంటున్నారు. ముఖ్యంగా, ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ నటనకి విజిల్స్ పడతాయని X లో పోస్టులు పెడుతున్నారు.

ముగ్గురు స్నేహితులు కలిసి ఊర్లో ఉండే ఆలయాన్ని, దాని వారసత్వాన్ని రక్షించేందుకు బలంగా నిలబడటం బాగుందని అంటున్నారు. అయితే, ఫస్టాఫ్ కొంత రెగ్యులర్‌ ఫీల్ ఇస్తుందని, ఇంటర్వెల్ సీన్‌తో కథ పుంజుకొనేలా ఉందని, సెకండాఫ్‌ సినిమా మొత్తానికే ప్లస్ పాయింట్ అవుతుందని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఓ నెటిజన్ తన రివ్యూను పంచుకుంటూ..  'భైరవం ఒక సో-సో రస్టిక్ యాక్షన్ డ్రామా. ఫస్టాఫ్ కొంత ప్రశాంతంగా అనిపించింది. కానీ, సెకండాఫ్ ఆ సెటప్‌ను ఉపయోగించుకోలేకపోయింది. ఈ సినిమాలో ముగ్గురు మెయిన్ హీరోలు నటించారు. వారిలో అందరూ బాగా నటించారు. సినిమా కంటెంట్ తగ్గట్టుగా నటించారు.

కొన్ని సీన్స్ లో వారి నటనతో డ్రామా బాగా ఎలివేట్ చేశారు. కానీ, మరికొన్ని పోర్షన్ లో మాత్రమే చాలా ఊహించదగినదిగా అనిపిస్తుంది. అనవసరమైన లవ్ ట్రాక్, పాటలు కథా గమనాన్ని దెబ్బతీస్తాయి.

ఓవరాల్ గా ఫస్టాఫ్ మంచి డ్రామాని పండించింది. సెకండాఫ్ మాత్రం మితిమీరిన యాక్షన్ మోడ్‌లోకి వెళుతుంది. సెకండాఫ్ లో డైరెక్టర్ యాక్షన్ వల్ల డ్రామాని చూపించలేకపోయాడు' అని తన అభిప్రాయం పంచుకున్నారు.

మరో నెటిజన్ రివ్యూ పంచుకుంటూ.. 'భైరవం ముగ్గురి స్నేహితుల ఉత్తమ ప్రదర్శనతో సెట్ చేసిన మంచి రీమేక్. ఈ మూవీకి బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ అతిపెద్ద ఆస్తి. మూవీ సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాలకి అభినందనలు. అతనిచ్చిన BGM గూస్బంప్స్ తెప్పిస్తుంది.

దర్శకుడు విజయ్ కనకమేడల సున్నితమైన అంశాన్ని చాలా అద్భుతంగా.. హై-ఎలివేషన్ క్షణాలతో తెరకెక్కించి సక్సెస్ అయ్యాడు' అని తెలిపాడు.