Manchu Manoj, Mounika: మంచు వారింటికొచ్చిన మహాలక్ష్మి.. పాపతో మనోజ్, మౌనిక వీడియో వైరల్

Manchu Manoj, Mounika: మంచు వారింటికొచ్చిన మహాలక్ష్మి.. పాపతో మనోజ్, మౌనిక వీడియో వైరల్

టాలీవుడ్ హీరో మంచు మనోజ్(Manchu Manoj) తండ్రైన సంగతి తెలిసిందే. ఆయన సతీమణి మౌనిక(Mounika) పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ సోదరి మంచు లక్ష్మి(Manchu Lakshmi) సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. దేవుడి ఆశీర్వాదంతో మా ఇంటికి మరో చిన్నారి వచ్చింది. మనోజ్, మౌనికాలకు కుమార్తె పుట్టింది. పాపకు ఎంఎం పులి అని ముద్దు పేరు కూడా పెట్టాము.. అంటూ పోస్ట్ చేశారు మంచు లక్ష్మి. 

ఇక తాజాగా.. హాస్పిటల్ నుండి మౌనిక రెడ్డి డిశ్చార్జ్ అవడంతో పాపతో కలిసి ఆమె ఇంటికి వచ్చారు. ఇక మొదటిసారి పాపను ఇంట్లోకి తీసుకు వెళ్తున్న సందర్భంగా వారికి హారతి ఇచ్చి పూలతో స్వాగతం పలికారు కుంటుంబ సభ్యులు. ప్రస్తుతం దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.