
మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య వివాదం గురించి అందరికీ తెలిసిందే.. మంచు విష్ణు గొడవ పడ్డ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు బయటపడ్డాయి. ఇంటి పరువు వీధికెక్కడంతో మోహన్ బాబు, మంచు విష్ణు ఏవో చిన్న చిన్న గొడవలని కొట్టిపారేశారు కూడా. అందరి ఇళ్లల్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని పట్టించుకోవద్దని చెప్పారు.
ఈ వివాదంపై లేటెస్ట్ గా స్పందించిన మనోజ్ ఆ గొడవ గురించి తనకంటే మీడియాకే బాగా తెలుసని అన్నాడు. త్వరలోనే కొత్త సినిమాతో మీ ముందుకు వస్తున్నానని.. ఆ దేవుడి ఆశీస్సులతో పాటు మీ అందరి ఆశీర్వాదం కావాలని కోరాడు. తనకు సినిమాలే జీవితమని..సినిమా లేకుంటే తనకేం లేదని చెప్పాడు. ఇటీవలె కొత్త జీవితం ప్రారంభించానని మనోజ్ వెల్లడించాడు. కొన్ని రోజుల క్రితం మనోజ్ భూమా మౌనికను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.