వాట్ ది ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. టెరిఫిక్ రోబో లుక్లో మనోజ్

వాట్ ది ఫిష్ ఫస్ట్ గ్లింప్స్ వచ్చేసింది.. టెరిఫిక్ రోబో లుక్లో మనోజ్

చాలా గ్యాప్ తరువాత మంచు వారబ్బాయి మంచు మనోజ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ "వాట్ ది ఫిష్". ఈ మధ్యే అఫీషియల్ మొదలైంది ఈ సినిమా. ఇక మే 20న మంచు మనోజ్ పుట్టినరోజు సందర్బంగా వాట్ ది ఫిష్ మూవీ నుండి ఫస్ట్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ గ్లింప్స్ లో మనోజ్ గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో ఆకట్టుకుంటున్నారు. టెక్నో ఫాంటసీ మూవీగా రూపొందుతున్నట్లు ఈ గ్లింప్స్ చూస్తే అర్థం అవుతోంది. 

రోబోలా కనిపిస్తున్న మనోజ్ లుక్ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తోంది. అంతేకాదు వాట్ ది ఫిష్ టైటిల్ కు ‘మనం మనం బరంపురం’ అనే క్యాచీ ట్యాగ్ లైన్ ను కూడా యాడ్ చేశారు. ఇక ఈ సినిమాతో మనోజ్ మళ్లీ ఆయన సక్సెస్ బాట పట్టడం ఖాయం అంటున్నారు సినీ అభిమానులు. డార్క్ కామెడీ, హై-ఆక్టేన్ థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాతో మనోజ్ ప్రేక్షకుల హృదయాలను చూరగొంటారని ఇప్పటికే దర్శకుడు వరుణ్ వెల్లడించారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నిం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

అత్యాధునిక టెక్నాలజీతో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాకి ఫిదా మూవీ ఫేం శక్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు.   

https://www.youtube.com/watch?v=Dp6-U9Q_qZw