
టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. హీరోలు తమ కెరీర్‌లోని సూపర్ హిట్ చిత్రాలను రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్‌లో జోష్‌ని నింపుతున్నారు. తాజాగా మంచు విష్ణు, జెనీలియా జంటగా నటించిన ‘ఢీ’చిత్రాన్ని జూన్ 6న మరోసారి విడుదల చేస్తున్నారు.
శ్రీనువైట్ల రూపొందించిన ఈ మూవీ 2007లో విడుదలై కామెడీ ఎంటర్‌టైనర్‌గా అందర్నీ అలరించింది. ఈ సినిమాలో శ్రీహరి పాత్ర, బ్రహ్మానందం కామెడీ, సునీల్ ట్రాక్‌ను ఆడియెన్స్ ఎంతగానో ఎంజాయ్ చేశారు. ఆద్యంతం సరదాగా సాగుతూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచేలా చేసింది. ఇది వెంకీ మూవీ తర్వాత శ్రీను వైట్ల నుంచి మంచి హాస్యం పండిన చిత్రంగా నిలిచింది.
అంతేకాకుండా, విష్ణు కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా.. రీ రిలీజ్‌లోనూ మంచి వసూళ్లను రాబడుతుందని భావిస్తున్నారు. మరోవైపు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా రూపొందిన ‘కన్నప్ప’చిత్రం జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sri Hari gaari kosam 😎🔥#Dhee #DheeReRelease pic.twitter.com/15qlRirpVl
— SRi Harsha😈 (@Sanivaar) June 2, 2025