తనవల్లే మీ విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక

తనవల్లే మీ విలువ తెలిసింది.. కన్నీళ్లు పెట్టుకున్న మౌనిక

మంచు వారబ్బాయి మంచు మనోజ్(Manchu Manoj)  కొత్త అవతారం ఎత్తారు. ఇంతకాలం హీరోగా వెండితెరపై ఆడియన్స్ ను అలరించిన ఈ హీరో ఇప్పుడు హోస్ట్ గా మారిపోయారు. ఆయన హోస్ట్ గా ప్రముఖ ఛానెల్ లో ఓ టాక్ షో చేయనున్నారు. ఉస్తాద్‌–ర్యాంప్‌ ఆడిద్దాం పేరిట రానున్న ఈ షోకు సంబంధించిన ప్రోమోను డిసెంబర్ 7న రిలీజ్‌ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఈవెంట్ లో మంచు మనోజ్ తన భార్య మౌనిక గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. 

ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ..  దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత ఏడడుగులు వేసి మళ్లీ ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. ఈ గ్యాప్‌లో చాలా డిఫరెంట్‌ లైఫ్‌ను చూశాను, అనుభవించాను. ముందు సినిమాలు చేస్తున్నప్పుడు ఒక ప్యాషన్ ఉండేది కానీ.. ఇప్పుడు ప్యాషన్ తోపాటు మీ ప్రేమ, బాధ్యత కూడా ఉంది. ఆ సమయంలో నాకు ధైర్యాన్ని ఇచ్చింది ఫ్యాన్స్ ప్రేమ, అభిమానమే. నాకు ఆ విలువ మౌనికతో ప్రేమలో పడ్డాకే తెలిసింది. మంచి టీం దొరికింది.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. భర్త స్టేజిపై తన గురించి అలా మాట్లాడుతుంటే ఆయన మాటలకు ఫుల్ ఎమోషనల్ అయ్యారు మౌనిక. కన్నీళ్లు కూడా పెట్టుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ఇక మంచు మనోజ్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆయన వాట్ ది ఫిష్ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం షెరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను కొత్త దర్శకుడు వరుణ్ కోరుకొండ తెరకెక్కిస్తున్నాడు. వచ్చేఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలో దక్ష నాగర్కర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. మరి ఏడేళ్ల గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న మంచు మనోజ్ ఈ సినిమాతో విజయం అందుకుంటారో లేదో చూడాలి.