ఆపదలో అంబులెన్స్ ఉపయోగపడుతుంది : మంచు విష్ణు

ఆపదలో అంబులెన్స్ ఉపయోగపడుతుంది : మంచు విష్ణు

దేవరకొండ, వెలుగు : ఆపద సమయంలో అంబులెన్స్ ఎంతో ఉపయోగపడుతుందని మా అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ హీరో మంచు విష్ణు అన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీ ఆధ్వర్యంలో అందించిన ఉచిత అంబులెన్స్ ను శుక్రవారం దేవరకొండ బస్టాండ్ ఆవరణలో మంచు విష్ణు ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రైస్తవ జన సమితి జాతీయ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ కోరిక మేరకు పేదల అవసరాల కోసం అంబులెన్స్ ఇచ్చినట్లు తెలిపారు. ఉచిత అంబులెన్స్ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు.