కన్నప్ప నుండి సాలిడ్ అప్డేట్.. చూస్తుంటే కెరీర్ బెస్ట్ అయ్యేలా ఉంది

కన్నప్ప నుండి సాలిడ్ అప్డేట్.. చూస్తుంటే కెరీర్ బెస్ట్ అయ్యేలా ఉంది

మంచు విష్ణు తన కెరీర్ బెస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ కన్నప్ప. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం న్యూజీలాండ్ లో షూటింగ్ జరుగుతోంది. అయితే ఈసారి హిట్టు కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మంచు విష్ణు అందుకోసం స్టార్ క్యాస్ట్ ను రంగం లోకి దించుతున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, నయనతారలు ఇలా ఆల్ లాంగ్వేజెస్ నుండి స్టార్స్ ను తీసుకున్నారు. దీంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. 

అయితే తాజాగా కన్నప్ప సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ ఇచ్చేశారు మేకర్స్. నవంబర్ 23 మంచు విష్ణు పుట్టునరోజు సందర్బంగా కన్నప్ప సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఎదురుగా దూసుకువస్తున్న బాణాల మధ్య నుండి విల్లు పట్టుకోని ఉన్న మంచు విష్ణు లుక్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. ఫేస్ కనిపించకుండా డిజైన్ చేసిన ఈ పోస్టర్ లో… శివలింగం కనిపించేలా పోస్టర్ ను చాలా హైలైట్ గా డిజైన్ చేశారు. ఈ పోస్టర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటోంది. అంతేకాదు సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది ఈ పోస్టర్. ఇది చుసిన ఆడియన్స్ సినిమా కూడా ఇదే రేంజ్ లో ఉంటే బ్లాక్ బస్టర్ అవడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు. 

ఇక్కడ మరో విశేషం ఏంటంటే.. కన్నప్ప సినిమా కథను మంచు విష్ణునే అందించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మోహన్ బాబు నిర్మిస్తున్నారు. మణిశర్మ, స్టీఫెన్ దేవస్ సంగీతం అందిస్తున్నారు. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.