రాష్ట్రానికి దిక్కులేదు కాని దేశం పోయి ఏం చేస్తడు: మందకృష్ణ మాదిగ

రాష్ట్రానికి దిక్కులేదు కాని దేశం పోయి ఏం చేస్తడు: మందకృష్ణ మాదిగ

రాష్ట్రంలో అనాథల కోసం చట్టం తేవాలన్న డిమాండ్ తో ఈ నెల 15 నుంచి ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేయనుంది. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ తెలిపారు. గురుకుల పాఠశాలల్లో అనాథల కోసం రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పిన ప్రభుత్వం..ఏడేళ్లయినా  ఎలాంటి వసతులు కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా అనాథల కోసం చట్టం తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక హామీని కేసీఆర్ మరిచారని మండిపడ్డారు. అనాథలకు ప్రత్యేక స్మార్ట్ కార్డులు ఇస్తామన్న కేసీఆర్..ఇప్పుడు వారి గురించి ఇక్క మాట మాట్లాడటం లేదన్నారు. రాష్ట్రంలో అనాథలను రక్షించే దిక్కులేదు కాని కేసీఆర్ దేశంలో ఏం చేస్తారని ఆయన నిలదీశారు. అసెంబ్లీ సమావేశంలో అనాథల కోసం సమగ్రమైన చట్టం చేయాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. 

 
ఈనెల 13న రాష్ట్రానికి ప్రధాని మోడీ రాకను వ్యతిరేకిస్తూ.. హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిని నిర్భంధిస్తామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లపై లోక్ సభలో బిల్ పెట్టకపోవడంతో..తాము ఉన్నత విద్యా అవకాశాలు కోల్పోతున్నామని చెప్పారు. మాదిగలు తలుచుకుంటే బీజేపీ ఓడించగలమని హెచ్చరించారు.