సమతామూర్తి దర్శనానికి 4 రోజులు బ్రేక్

సమతామూర్తి  దర్శనానికి 4 రోజులు బ్రేక్

ముచ్చింతల్ : శంషాబాద్ సమీపంలోని సమతామూర్తి కేంద్రంలో ఈ నెల 29 నుంచి మండలాభిషేకాలు, ఆరాధనలు నిర్వహించనున్నారు. ఈ క్రమంలో మార్చి 29 నుంచి ఏప్రిల్ 1 వరకు నాలుగు రోజుల పాటు భక్తులకు అనుమతి ఉండదని చిన్నజీయర్ స్వామి ప్రకటించారు. ఏప్రిల్ 2వ తేదీ నుంచి ఉగాది శోభతో సమతామూర్తి, సువర్ణమూర్తి, దివ్యదేశ సందర్శనం తిరిగి ప్రారంభించనున్నట్లు చెప్పారు. ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దర్శనం కొనసాగుతుందని చెప్పారు. ప్రతి బుధవారం యధావిధిగా సెలవు ఉంటుందని, ప్రవేశ రుసుములో ఎలాంటి మార్పు లేదని చెప్పారు. దర్శనానికి వచ్చే వారందరూ సంప్రదాయ వస్త్రాలతో రావాలని, సెల్ ఫోన్, కెమెరాలు తదితర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి ఉండదని చెప్పారు. ఎలాంటి ఆహార పానీయాలు లోపలికి అనుమతించమని, భక్తులందరూ నిబంధనలు పాటిస్తూ సిబ్బందికి సహకరించాలని కోరారు.

For more news..

రూ.500 కోట్ల క్లబ్లో RRR 

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు