బస్సులు నడపాలని కాంగ్రెస్ లీడర్ల వినతి

బస్సులు నడపాలని కాంగ్రెస్ లీడర్ల వినతి

కోల్​బెల్ట్​,వెలుగు: మందమర్రి మార్కెట్​లోని బస్టాండ్ ​నుంచి వివిధ ప్రాంతాలకు బస్సులు నడిపించాలని యూత్​ కాంగ్రెస్ ​లీడర్లు డిమాండ్​చేశారు. శుక్రవారం మంచిర్యాల ఆర్టీసీ డీఎం జనార్ధన్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. నిత్యం పెద్ద సంఖ్యలో మందమర్రి మార్కెట్​ నుంచి ప్రజలు మంచిర్యాల, హైదరాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారని, సరిపడా బస్సుల సంఖ్యను పెంచాలన్నారు. 

ఆసిఫాబాద్, బెల్లంపల్లి నుంచి వచ్చే బస్సులను తప్పనిసరిగా మార్కెట్​లోని బస్టాండ్​కు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మందమర్రి నుంచి హైదరాబాద్​ కు బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. యూత్ కాంగ్రెస్ నాయకులు రాయబారపు కిరణ్, రామసాని సురేందర్, ఎండీ.తౌసిఫ్, బి.గణేశ్, ఆర్.కిరణ్, ఎం.సతీశ్, సాయి కిరణ్ పాల్గొన్నారు.