పెరుగుతున్న కేసులు.. ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం..

పెరుగుతున్న కేసులు.. ఢిల్లీ సర్కారు కీలక నిర్ణయం..

ఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది . మాస్క్ తప్పనిసరి చేయాలని నిర్ణయించినట్లు  సమాచారం. వారం రోజులుగా కేసులు పెరుగుతుండటంతో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ ఇవాళ ప్రత్యేకంగా భేటీ అయి ఈ అంశంపై చర్చించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మాస్క్ తప్పనిసరి చేయాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. మాస్క్ పెట్టుకోని వారికి రూ.500 ఫైన్ వేయాలని భేటీలో నిర్ణయించినట్లు సమాచారం. కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి స్కూళ్లు యథావిధిగా నడపాలని అధికారులు భావిస్తున్నారు.

మూడు వారాల క్రితం ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో ప్రభుత్వం మాస్క్ నిబంధనను ఎత్తివేసింది. మాస్క్ పెట్టుకోని వారికి ఎలాంటి ఫైన్ విధించమని ప్రకటించింది. రద్దీ ప్రాంతాల్లో మాత్రం మాస్క్ పెట్టుకోవాలని సూచించింది. అయితే గత కొన్ని రోజులుగా దేశ రాజధానిలో కొవిడ్ 19 కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మంగళవారం 632 కేసులు నమోదుకాగా.. పాజిటివిటీ రేటు 4.42శాతంగా ఉంది.