సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

సైలెంట్గా ఓటీటీకి వచ్చేసిన మంగళవారం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఆర్ఎక్స్ 100(RX 100) సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ మంగళవారం(Mangalavaaram). సౌత్ బ్యూటీ పాయల్ రాజ్ ఫుత్ ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా నవంబర్ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో చాలా కాలం తరువాత వచ్చిన రూరల్ హారర్ థ్రిల్లర్ మూవీ కావడంతో ఆడియన్స్ ఈ సినిమాను చూసేందుకు ఎగబడ్డారు. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర సూపర్ కలెక్షన్స్ రాబట్టింది మంగళవారం మూవీ. ఇక మహాసముద్రం మూవీఠీ బిగ్గెస్ట్ డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న దర్శకుడు అజయ్ కి మంగళవారం సినిమాతో బ్లాక్ బస్టర్ పడింది.

అయితే.. మంగళవారం సినిమా రిలీజై నెల గడుస్తున్నా.. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్నారు. మరి ఆడియన్స్ కు సర్ప్రైజ్ ఇద్దామని ప్లాన్ చేశారో ఏమో తెలియదు కానీ.. మంగళవారం సినిమా సడన్ గా ఓటీటీలో ప్రత్యేక్షమయ్యింది. అంతేకాదు.. మంగళవారం సినిమాను మంగళవారం రోజునే ఓటీటీలోకి తీసుకొచ్చారు. డిసెంబర్ 26 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్ లో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.