
‘ఆర్ఎక్స్ 100’ చిత్రంతో పాయల్ రాజ్‌పుత్‌ను హీరోయిన్‌గా పరిచయం చేసిన అజయ్ భూపతి.. ఇప్పుడు ఆమె ప్రధాన పాత్రలో ‘మంగళవారం’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. స్వాతి గునుపాటి, ఎం.సురేష్ వర్మ, అజయ్ భూపతి కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ పూర్తయిందని తెలియజేశారు మేకర్స్. ఈ సందర్భంగా అజయ్ భూపతి మాట్లాడుతూ ‘నైంటీస్‌లో విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగే స్టోరీ ఇది. రా అండ్ రస్టిక్‌గా ఉండే డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్. మొత్తం 30 పాత్రలు ఉన్నాయి. ప్రతి పాత్రకు కథలో ప్రాముఖ్యం ఉంటుంది. . ‘కాంతార’ ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ సంగీతం హైలైట్‌గా ఉంటుంది’ అని చెప్పాడు. సినిమా పూర్తి చేయడానికి మొత్తం 99 రోజులు పట్టిందని, అందులో 48 రోజులు పగటి పూట షూటింగ్ చేస్తే, 51 రోజులు రాత్రి వేళల్లో షూట్ చేశామని నిర్మాత చెప్పారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.