మాంగనీస్ ఓర్ ఇండియా లిమిటెడ్ (MOIL) గ్రాడ్యుయేట్, మేనేజ్మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ సమర్పించడానికి చివరి తేదీ జనవరి 20.
పోస్టులు: 67.
విభాగాల వారీగా ఖాళీలు: గ్రాడ్యుయేట్ ట్రైనీ 49, మేనేజ్మెంట్ ట్రైనీ 15, మేనేజర్ (సర్వే) 03.
ఎలిజిబిలిటీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ కళాశాల నుంచి సంబంధిత విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎం.టెక్., ఎంబీఏ, పీజీ డిప్లొమా, బి.టెక్./ బీఈ, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి: 35 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మన్ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.590.
లాస్ట్ డేట్: 2026, జనవరి 20.
సెలెక్షన్ ప్రాసెస్: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు www.cochinshipyard.in వెబ్సైట్ను సందర్శించండి.
