వావ్.. ఒక్కచోటే 500 రకాల మామిడి పండ్లు

వావ్.. ఒక్కచోటే 500 రకాల మామిడి పండ్లు

మామిడి రకాలెన్ని అంటే .. బంగినపల్లి, తోతాపురి, దసేరి, కేసరి.. ఇలా కొన్ని పేర్లయితే చెప్పగలరు. కానీ.. అక్కడ చాలామందికి తెలియని రకాలు ఎన్నో ఉన్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 5 వందల రకాల మామిడిపండ్లు. కొనుక్కున్నోళ్లకు కొనుకున్నంత.

సీజన్ అయిపోతుండటంతో… మ్యాంగోలకు డిమాండ్ కూడా పెరిగింది. ఇవి మన హైదరాబాద్ లోలాగా మందు పెట్టి పండించి అమ్మతున్న మామిడి పండ్లు కాదండోయ్. స్వచ్ఛంగా… సేంద్రీయ పద్ధతిలో పండించిన మామిడి పంటలు.

దేశ రాజధాని ఢిల్లీలో ఏర్పాటుచేశారు ఈ మ్యాంగో ఫుడ్ ఫెస్టివల్. ఢిల్లీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ సహాయంతో.. జనక్ పురిలోనీ డిల్లీ హాట్ ఏరియాలో ఈ మ్యాంగో ఎగ్జిబిషన్ పెట్టారు. దేశంలో పలు రాష్ట్రాల్లో పండించిన మొత్తం 5వందల వెరైటీలు ఇక్కడ నోరూరిస్తున్నాయి. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ కార్యక్రమానికి హాజరై పండ్లు టేస్ట్ చేశారు.