మణికే మగే హితే మన భాషలో

V6 Velugu Posted on Sep 15, 2021

ఇన్‌‌స్టా, ఫేస్‌‌బుక్‌‌, యూట్యూబ్‌‌ ఏది ఓపెన్‌‌ చేసినా ఒకటే పాట.. ‘మణికే మాగే హితే’. యూట్యూబ్‌‌లో పది కోట్ల వ్యూస్‌‌ కొల్లగొట్టింది 
ఈ పాట. షార్ట్‌‌ రీల్స్‌‌ దుమ్ము దులుపుతోంది. మ్యూజిక్‌‌ లవర్స్‌‌ను మెస్మరైజ్‌‌ చేస్తోంది. సంగీతానికి భాషతో పనిలేదని నిరూపించింది ఈ పాట. భాష ఏదైనా.. భావం అర్థం కాకపోయినా ఇంటర్నేషనల్‌‌ లెవెల్‌‌లో ఈ పాటకు ఫుల్‌‌ క్రేజ్‌‌ వచ్చేసింది.  

శ్రీలంకకు చెందిన యొహానీ డిలోకా డిసిల్వా అనే సింగర్‌‌‌‌ ‘మణికే మాగే హితే’ అంటూ సింహళ భాషలో ఓ పాట పాడింది. హస్కీ వాయిస్‌‌తో, మంచి ఎక్స్‌‌ప్రెషన్స్‌‌తో ఆమె పాడిన పాట ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్‌‌ లవర్స్‌‌ను ఉర్రూతలూగిస్తోంది. చాలామంది సెలబ్రిటీలు సైతం ఈ పాటకు రీల్స్‌‌ చేశారు. బిగ్‌‌బీ అమితాబ్‌‌బచ్చన్‌‌కి కూడా ఈ పాట తెగ నచ్చేసిందట. దాంతో ఒక రోజంతా ఈ పాట వింటూనే ఉన్నారట ఆయన. తన సినిమాలోని ఒక పాటతో ఈ మ్యూజిక్‌‌ను రీమిక్స్‌‌ చేసి, ఆ పాటను ఎంజాయ్‌‌ చేస్తున్న వీడియోను సోషల్‌‌ మీడియాలో పోస్ట్‌‌ చేశారు అమితాబ్‌‌. బాలీవుడ్‌‌ నటులు మాధురి దీక్షిత్‌‌, సింగర్‌‌‌‌ సోనూ నిగమ్‌‌ కూడా ఈ పాటకు ఫిదా అయిపోయారు. యొహానీ డిలోకా పాడిన ఈ పాటను ఇతర భాషల్లో కూడా రీమేక్‌‌ చేస్తున్నారు లోకల్‌‌ సింగర్స్‌‌. రీమేక్‌‌ సాంగ్స్‌‌ను కూడా లక్షల్లో వింటున్నారు మ్యూజిక్‌‌ లవర్స్‌‌.      
ఆమె కాదు..
నిజానికి ‘మణికే మాగే హితే’ పాట 2020లోనే రిలీజ్‌‌ అయ్యింది. ఒరిజినల్‌‌ సాంగ్‌‌ పాడింది సతీషన్‌‌, ర్యాపర్‌‌‌‌ దుల్హన్‌‌ ఏఆర్‌‌‌‌ఎక్స్‌‌ అనే సింగర్లు.  ఈ పాట రాసింది కూడా దుల్హనే. అప్పట్లోనే ఆ పాటకు మంచి క్రేజ్‌‌ వచ్చింది. లక్షల్లో వ్యూస్‌‌ వచ్చాయి. అయితే, యొహానీ డిలోకా డిసిల్వా 2021లో దాన్ని రీమేక్‌‌ చేసింది. ఆమె హస్కీ వాయిస్‌‌తో పాడటం, పాట వినసొంపుగా ఉండటంతో మస్త్‌‌ ఫేమస్‌‌ అయ్యింది. 
తెలుగుతో పాటు..
ప్రపంచవ్యాప్తంగా ఫేమస్‌‌ అయిన ఈ పాటను చాలా భాషల్లో రీమేక్‌‌ చేస్తున్నారు. కవర్‌‌‌‌ సాంగ్స్‌‌ చేస్తూ క్రేజ్‌‌ తెచ్చుకుంటున్నారు చాలామంది. తెలుగు, తమిళ, బెంగాలీ, పంజాబీ, కన్నడ భాషల్లో దీన్ని రీమేక్‌‌ చేశారు. తెలుగులో దాదాపు మూడు పాటలకు పైగానే కవర్‌‌‌‌ సాంగ్స్‌‌ ఉన్నాయి. వాటిల్లో సింగర్‌‌‌‌ ఎం.ఎల్‌‌ శృతి, రోల్‌‌ రైడా కలిసి పాడిన పాట మస్త్‌‌ ఫేమస్‌‌ అయ్యింది. “ మనకే లవ్వే అయితే.. జతగా నీతో కలిసుండాలి” అని పాడిన పాట మ్యూజిక్‌‌ లవర్స్‌‌ని ఆకట్టు కుంటోంది. ఇప్పటికే దాదాపు 5 లక్షలకు పైగా ఆ పాటను చూశారు యూట్యూబ్‌‌లో.  రాక్‌‌ స్టార్‌‌‌‌ శివమణి, జశ్విన్‌‌లు చేసిన మరో 2 పాటలు లక్షల మంది చూశారు.

Tagged language, , Manike mage hithe

Latest Videos

Subscribe Now

More News