గొడవలు ఆపండి.. మైతీలు, కుకీలకు ముస్లింల విజ్ఞప్తి

గొడవలు ఆపండి.. మైతీలు, కుకీలకు ముస్లింల విజ్ఞప్తి

న్యూఢిల్లీ: మైతీలు, కుకీల మధ్య ఘర్షణ లతో మూడున్నర నెలలుగా మణిపూర్‌‌‌‌‌‌‌‌‌‌ అట్టుడుకుతోంది. ఈ రెండు వర్గాల మధ్య దాడులు ప్రతిదాడులతో మధ్యలో స్థానిక ముస్లింలు నలిగిపోతున్నారు. ముఖ్యంగా క్వాక్టా ఏరియాలో తమకు సంబంధం లేకున్నా దాడులకు గురవు తున్నారు. క్వాక్టా పట్టణంలో 90 శాతం జనాభా ముస్లింలే. కానీ తమకు సంబం ధం లేకపోయినా ఘర్షణల కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని వాళ్లు చెబుతున్నారు. 

ఇకనైనా గొడవలు ఆపాలని మైతీలు, కుకీలను కోరుతు న్నారు. ‘‘క్వాక్టాలోని జనం భయాందో ళనతో బతుకుతున్నారు. నిత్యావసరాల ధరలు భారీగా పెరిగాయి. ఉపాధి దెబ్బతిన్నది. బాంబు దాడులతో స్కూళ్లు నాశనమయ్యాయి” అని ముస్లిం స్కాల ర్ నాసిర్ ఖాన్ చెప్పారు. ‘శాంతి నెలకొ ల్పేందుకు సహకరించాలని మైతీ, కుకీ సోదరులను కోరుతున్నాం” అని స్థానిక ముస్లిం లీడర్ హాజీ రఫత్ అలీ చెప్పారు.