
- ప్రభుత్వానికి మణిపూర్ హైకోర్టు ఆదేశం
మణిపూర్: కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు పరిమిత ఇంటర్నెట్ సర్వీస్ అందజేయా లని మణిపూర్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా స్టూడెంట్ల అడ్మిషన్లు జరుగుతున్నందున ఇంటర్నెట్ ఫెసిలిటీ కల్పించాలన్న పలు వురి అభ్యర్థ నల మేరకు కోర్టు మంగళవారం మధ్యం తర ఉత్తర్వులిచ్చింది. ప్రజలకు అత్యవసర సేవలు నిర్వహించుకునేందుకు వీలుగా లిమిటెడ్గా ఇంటర్నెట్ అందజేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
సోషల్ మీడియా వెబ్సైట్లకు కాకుండా, ఇతర అవసరాల మేరకు ఇంటర్నెట్ అందించే వీలు ఉందో లేదో చెప్పాలని సర్వీస్ ప్రొవైడర్లను ఆదేశించింది. కుకీలు, మైతీల మధ్య ఘర్షణలు మొదలైన మరుసటి రోజు మే 4 నుంచి రాష్ట్రంలో ఇంటర్నెట్ సేవలను ప్రభుత్వం బ్యాన్ చేసింది.