అప్పటి వరకు రికార్డింగ్‌ను నిలిపివేయాలి.. మణిపూర్ వీడియోపై సుప్రీం

అప్పటి వరకు రికార్డింగ్‌ను నిలిపివేయాలి.. మణిపూర్ వీడియోపై సుప్రీం

మణిపూర్ వైరల్ వీడియో కేసులో ఇద్దరు బాధితుల వాంగ్మూలాన్ని ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు కేసును విచారించే వరకు రికార్డింగ్‌ను నిలిపివేయాలని దర్యాప్తు సంస్థ సీబీఐని సుప్రీంకోర్టు కోరింది. నేటి విచారణ ఫలితాల కోసం వేచి ఉండేమని సీబీఐకి తెలియజేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు చెప్పింది. అంతకుముందు జరిగిన విచారణలో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన అత్యంత భయానకమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పట్నుంచి తీసుకున్న చర్యలపైనా సుప్రీం ఆరా తీసింది.

ఈ ఘటన మే 4న జరిగితే.. మే 18వరకు పోలీసు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని కోర్టు ప్రశ్నించింది. పోలీసులు ఏం చేస్తున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు 14రోజులు ఎందుకు పట్టిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతే కాకుండా జూన్ 24న ఈ కేసు ఎఫ్ఐఆర్ ను మెజిస్టీరియల్ కోర్టుకు ఎందుకు ట్రాన్స్ ఫర్ చేశారో చెప్పాలని ధర్మాసనం నిలదీసింది.