
ఇంఫాల్: మణిపూర్‌లో హింస కొనసాగుతూనే ఉంది. బుధవారం రాత్రి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పేలుళ్లు, కాల్పులు జరిగాయని, గురువారం తెల్లవారుజామున దుండగుల కాల్పుల్లో ఇద్దరు సోల్జర్లు గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. బిష్ణుపూర్ జిల్లాలో పార్క్ చేసిన ఓ వెహికల్‌లో ఐఈడీ బాంబును అమర్చి, దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారని తెలిపారు. అలాగే, కంగ్పోక్పి జిల్లాలో మంగళవారం సాయంత్రం కాల్పులు జరిగాయని చెప్పారు.
భద్రతా దళాలు పరిస్థితిని కంట్రోల్ చేశాయన్నారు. అయితే, అడపా దడపా రాత్రి 2, 3 గంటల సమయంలో కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇంఫాల్ ఈస్ట్ జిల్లా ఉరంగ్‌పత్‌లో కాల్పుల శబ్దాలు వినిపించాయని, వెంటనే బలగాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చాయన్నారు.